NBK, Boyapati Political Drama Locked: నందమూరి బాలకృష్ణ(Balakrishna), దర్శకుడు బోయపాటి(Boyapati Srinu) కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. గతేడాది 'అఖండ'(Akhanda) సినిమాతో రికార్డులు సృష్టించిన వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి పొలిటికల్ డ్రామా కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. 2024 ఎన్నికల కంటే ముందు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 


ఈ సినిమాను నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. బోయపాటి మాత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. 2023లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. పవర్ ఫుల్ మాస్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను 2024 సమ్మర్ కి రిలీజ్ చేయాలనేది ప్లాన్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. 


ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.


దసరా కానుకగా ఫ్యాన్స్ కి ట్రీట్: 


ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతుంది. అయితే ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. నిజానికి ఈ సినిమాను ముందుగా దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తరువాత సంక్రాంతికి వెళ్లింది. ఇప్పుడేమో 'అఖండ' సెంటిమెంట్ కారణంగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే దసరా కానుకగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. దసరా రోజు సాయంత్రమే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు. బాలయ్య అభిమానులు ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండాలని కోరుకుంటున్నారు. కానీ టీమ్ మాత్రం డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటుంది. దసరా రోజు రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.


దీంతో పాటు మరో సినిమా ఒప్పుకున్నారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. 


Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్


Also Read : యాక్షన్ విత్ మెసేజ్, అంతా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు