కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్(Vignesh Shivan) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రీసెంట్ గా ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. జూన్ 9న మహాబలిపురం ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి జరిగింది. ఆ తరువాత నూతన దంపతులు దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమలకు వెళ్లారు. తమ పెళ్లి రోజు అందరికీ గుర్తుండిపోయేలా.. తమిళనాడులో సుమారు లక్ష మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు.
వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ జంట హనీమూన్ కి వెళ్లింది. థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో ఓ లగ్జరీ హోటల్ లో దిగారు నయనతార-విఘ్నేష్ శివన్. దీనికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపించారు.
నయనతార ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకొని ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. విఘ్నేష్ క్యాజువల్స్ లో కనిపించారు. ఈ ఫొటోలపై నెటిజనులు, సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు థాయిలాండ్ లోనే ఉండి తిరిగి చెన్నైకి చేరుకోనుంది ఈ జంట. అనంతరం నయనతార తను కమిట్ అయిన సినిమా షూటింగ్స్ లో పాల్గోనుంది.
Also Read: కరణ్ జోహార్ కిడ్నాప్ - బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ఇదే!
Also Read: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్