Nayanthara Properties: మొదట్లో టీవీ యాంకర్ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ - నయనతార ఆస్తులు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుసా ?

Nayanthara: నయనతార బయోపిక్ ఓటీటీలోకి వచ్చింది. అది పెళ్లి వీడియో అనుకుంటున్నారు అందరూ. కానీ అందులో నయన్ లైఫ్ గురించి మొత్తం ఉంది. కానీ ఆస్తుల వివరాలు చెప్పలేదు. వాటి వివరాలు ఇవీ

Continues below advertisement

Nayanthara has properties worth thousands of crores: సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే  నయనతార పేరు చెప్పాల్సింది. అటు అందం.. ఇటు అభినయం కలసి ఉన్న తార ఆమె. ఆమె కెరీర్ మొదట కేరళలో ఓ టీవీ చానల్లో ఓ చిన్న ప్రోగ్రాం యాంకర్ గా ప్రారంభమయింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అయ్యే ఆ క్లిప్ లు చూసి అందరూ ఆశ్చర్యపోతారు.ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారో చెప్పాల్సిన పని లేదు. ఎంత కష్టపడ్డారో.. ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నారో.. అంతే జాగ్రత్తగా తన ఆస్తుల్ని పెంచుకుంటూ వచ్చారు నయనతారు. ఇప్పుడు యాక్చవల్ ప్రాపర్టీలు వందల కోట్లలో ఉన్నప్పటికీ అసలు విలువ మాత్రం వేల కోట్లలో ఉంటుందని చెబుతారు. 

Continues below advertisement

దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన నయతాన.. మెట్రో సిటీలన్నింటిలోనూ పెద్ద పెద్ద ఇళ్లను కొనుగోలు చేశారని ఇండస్టీర వర్గాలు చెబుతున్నాయి.   చెన్నై.. బెంగుళూర్‌, హైద్రాబాద్‌, కొచ్చి లో ఉన్న లావిష్‌ ఇళ్లతో పాటు ఓపెన్‌ ల్యాండ్‌లు.. లగ్జరీ కార్‌లు ఉన్నాయి.  బంజారా హిల్స్‌లో రెండు ప్రీమియం అపార్ట్‌మెంట్స్ ఉన్నాయని.. వీటి విలువ దాదాపు కనీసం యాభై కోట్లకుపైగానే   ఉంటుందని టాక్.  చెన్నైతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నాయి.మహిళలకు సహజంగానే ఆభరణాలు అంటే ఇష్టం ఉంటుంది. నయనతారకూ అంతే. డిజైనర్ ఆభరణాలు కోట్లు విలువ చేసేవి ఉంటారని చెబుతారు 

Also Read: 'పుష్ప 2'లోని స్పెషల్ సాంగ్ 'కిస్సిక్'ను ఏ లాంగ్వేజ్‌లో ఎవరు పాడారో తెలుసా?

నయనతారకు ఓ సొంత కాస్మెటిక్ బ్రాండ్ ఉంది. 2023లో 9స్కిన్‌ అనే స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ను ఏర్పాటు చేసింది. దాంతోపాటు నయనతార వద్ద కోట్లు విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి. అలాగే పలు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. నయనతార ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటోంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో  టాప్ ఫైవ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈమెకు ఈ బ్యూటీకి ప్రైవేట్ జెట్ కూడా ఉంది. సొంత విమానం ఉన్న   ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమే. 

Also Read: 'జీబ్రా' రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?

నయనతార ఇండస్ట్రీకి వచ్చి  దశాబ్దాలు పూర్తి అయినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా ఆఫర్లను అందుకుంటే దూసుకుపోతోంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా చాలా సినిమాలను నిర్మించింది నయనతార. ప్రస్తుతం కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది. మొదట్లో కమర్షియల్ యాడ్స్‌లో నటించేవారు కాదు. తన క్రేజ్ పెరిగిన తర్వాత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ వస్తుంది కాబట్టి ఓకే చెప్పడం ప్రారంభించారు. నయనతారకు ఉన్న ఆస్తులు మార్కెట్ రేటు ప్రకారం రూ. 180కోట్ల విలువ ఉండవచ్చు కానీ.. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ వేయి కోట్ల వరకూ ఉంటుందని అంచనా.  

 

Continues below advertisement
Sponsored Links by Taboola