‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాలతో బోలెడంత క్రేజ్ సంపాదించిన నవీన్ పోలిశెట్టి.. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అవకాశాలు వస్తున్నాయని కంగారు పడకుండా మంచి కథలను ఎంపిక చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఇటీవల నవీన్.. ఓ నిర్మాణ సంస్థకు ఊహించని షాకిచ్చాడు. ఆ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడు. నవీన్ అలా ఎందుకు చేశాడంటే.. 


ఆ రెండు సినిమాల హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టికి అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సందర్భంగా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ నుంచి నవీన్ పోలిశెట్టి అడ్వాన్సులు తీసుకున్నాడు. అయితే, ఇప్పటివరకు నవీన్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన విశేషాలు ఏవీ అభిమానులతో పంచుకోలేదు. 


నవీన్ పోలిశెట్టి ఓ సినిమా కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరిపినట్లు తెలిసింది. ‘జాతిరత్నాలు’ సినిమా రైటింగ్ డిపార్ట్‏మెంట్‏లో కీలకంగా పనిచేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడి స్టోరీకి నవీన్ తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అతడు వినిపించిన కథలో కొన్ని మార్పులు చేయాలని నవీన్ సూచించించినట్లు సమాచారం. అయితే, అప్పటికీ ఆ కథ నవీన్ అనుకున్నంత బాగా రాకపోవడంతో ఆ సినిమా చేయలేనని చెబుతూ నవీన్  సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ సుమారు రూ.4 కోట్ల పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశాడని తెలిసింది. 


Also Read: తెలుగులో ‘మనీ హీస్ట్’ పార్ట్-5: ప్రొఫెసర్ చనిపోతారా? తెరపైకి టోక్యో ఫ్లాష్‌బ్యాక్!


రొటీన్ కథలు కాకుండా కొత్తగా అనిపించే చిత్రాలను చేయాలనే లక్ష్యంగా నవీన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ యువీ క్రియేషన్స్ కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. ఈ చిత్రం షూటింగ్ దసరా నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో హీరోయిన్ అనుష్క కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, అనుష్క ఈ సినిమా చేసేందుకు నిరాకరించడంతో ఈ ప్రాజెక్ట్‌కు కూడా బ్రేక్ పడిందనే ప్రచారం జరిగింది. నవీన్ మరోసారి ‘జాతిరత్నం’ దర్శకుడితో మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.  


Also Read: టాలీవుడ్ డర్టీ పిక్చర్‌లో ఊహించని ట్విస్ట్.. డ్రగ్స్ కేసులో లొంగిపోయిన కీలక నిందితుడు


Also Read: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?


Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..