Nara Rohith’s Sundarakanda Teaser Out: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నారా రోహిత్. మాంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆయన ముందుంటారు. ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆయన, తొలిసారి పూర్తి స్థాయి కామెండీ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. రోహిత్ కెరీర్ లో 20వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో ‘సుందరకాండ’ అనే పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఫుల్ ఫన్నీగా ఆకట్టుకున్న ‘సుందరకాండ’ టీజర్
‘సుందరకాండ’ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్నీగా ఆకట్టుకుంటుంది. “నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను..” అంటూ నారా రోహిత్ తనను పరిచయం చేసుకుంటాడు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఐదు క్వాలిటీస్ ఉండాలని రోహిత్ భావిస్తాడు. ఆయన అనుకున్న లక్షణాలు లేకపోవడంతో ఏ అమ్మాయి సెట్ కాదు. రోహిత్ కుటుంబ సభ్యులు రోహిత్ పెళ్లి విషయంలో చాలా టెన్షన్ పడుతుంటారు. “మీ అబ్బాయిలో ఏదైనా సమస్య ఉందా?” అని పూజారి అడగ్గా.. “మా వాడిలో సమస్య లేదు. మా వాడితోనే సమస్య” అని రోహిత్ తండ్రి పాత్రలో నటిస్తున్న నరేష్ చెప్పడం అందరినీ నవ్విస్తుంది. “వీడికి ఇన్నేళ్లు పెళ్లి కాలేదంటే పోనిలే పాపం అనుకున్నా. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు. వీడికి ఈ జన్మలో పెళ్లికాదు” అని రఘుబాబు అనడం మరింత ఫన్నీగా ఉంది. ఇందులో నారా రోహిత్ చూడ్డానికి ఏజ్‌డ్ లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఆయనకు ఐదు లక్షణాలు కలిగిన అమ్మాయి దొరికిందా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. అయితే, ఈ ఫన్నీటీజర్ సినిమాపై మంచి అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read: భయపడకు, నేనున్నాను... మహేష్ వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్!
సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు ‘సుందరకాండ’
‘సుందరకాండ’ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. నారా రోహిత్ హీరోగా నటిస్తున్నఈ మూవీలో శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు, అమృతం వాసు సహా పలువురు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీష్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రోహన్ చిల్లాలే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైన్ గా ఉన్నారు.
Also Read: మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!