హీరో నాని (Nani Actor) లో మంచి నటుడు ఉన్నాడు. అందుకే... అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు ముద్దుగా నేచురల్ స్టార్ అని పిలుస్తారు. ఎటువంటి పాత్రలో అయినా సరే సహజంగా నటిస్తారని నానికి పేరు ఉంది. అయితే, ఆయన మాస్ రోల్స్ కంటే ఎమోషనల్ క్లాసీ రోల్స్‌లో నటించినప్పుడు మంచి మంచి విజయాలు వచ్చాయి. ఇప్పుడు క్లాసీ లుక్, మాంచి లవ్ & ఎమోషన్స్‌తో కూడిన కథతో సినిమా చేస్తున్నారు.  


మంగళవారం ఓపెనింగ్...
బుధవారం రెగ్యులర్ షూట్
నాని 30వ సినిమా (Nani 30 Movie) లో ఆయనకు జోడీగా ఉత్తరాది కథానాయిక మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించనున్నారు. 'సీతా రామం' తర్వాత తెలుగులో ఆమె నటిస్తున్న రెండో చిత్రమిది. మంగళవారం (జనవరి 31న) పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆ రోజు ఓపెనింగ్ జరిగితే... మరుసటి రోజు ఫిబ్రవరి 1 (బుధవారం) రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.  


శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా ఈ సినిమా రూపొందుతోంది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్   



న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ప్రకటించారు. నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తున్నారు. ఆయన పక్కన ఓ చిన్న అమ్మాయి కూర్చుని ఉంది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వింటే... సినిమాలో తండ్రీ కుమార్తెలుగా నటిస్తున్నారని ఈజీగా అర్థం అయిపోతుంది. వాళ్ళిద్దరి బాండింగ్ సినిమాలో హైలైట్ కానుందని తెలుస్తోంది. 


Also Read : దేవుడి గదిలో దిష్టిబొమ్మ - ఆ 16 మంది తలలు ఏమయ్యాయ్? 


'దసరా' కోసం నాని మీసాలు, గడ్డం పెంచారు. కొత్త సినిమాలో మీసం, గడ్డం ఉండవని... షేవ్ చేస్తానని నాని కన్ఫర్మ్ చేశారు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర బృందం చెప్పింది. ఇందులో నాని కెమెరామెన్‌గా కనిపించనున్నారా? అంటే... ఫోటోలు తీస్తున్నారు కదా! ఇది నిజమా? కదా? అనేది తర్వాత తెలుస్తుంది. అన్నట్టు... 'దసరా' సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయాన్ని నాని ఖండించారు. ఒక్క సినిమా వస్తుందని, అందులో రెండు లేదా అంత కంటే ఎక్కువ శక్తివంతమైన పాత్రలు ఉంటాయని చెప్పారు. 


జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ తర్వాత...
ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహకుడు. నానితో ఆయనకు మూడో చిత్రమిది. 'జెర్సీ', 'శ్యామ్‌ సింగ రాయ్' చిత్రాలకూ ఆయన పని చేశారు. ఆ రెండు సినిమాల్లో సినిమాటోగ్రఫీ వర్క్ బావుందని పేరు వచ్చింది.


మలయాళ సినిమా 'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకులు అందరినీ తన పాటలతో ఆకట్టుకున్న ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆల్రెడీ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ వీడియోలో నేపథ్య సంగీతం బావుంది. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ : జోతిష్ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ ఈవీవీ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : భాను ధీరజ్ రాయుడు.