Bhootadham Bhaskar Narayana Teaser Review : అనగనగా ఓ డిటెక్టివ్ ఉన్నాడు. అతడి పేరు భాస్కర్... భాస్కర్ నారాయణ! ఊరిలో జనాలు అందరూ అతడిని 'భూతద్దం భాస్కర్ నారాయణ' అంటారు. రాష్ట్రం మొత్తం తన గురించి మాట్లాడుకోవాలంటే... స్నేహితుడు సలహా ఇచ్చినట్టు సీరియల్ కిల్లర్ మర్డర్ కేస్ టేకప్ చేస్తాడు. ఆ కేసు వివరాల్లోకి వెళితే... 


అనగనగా ఓ ఊరు. పదహారు మంది చనిపోతారు. వాళ్ళందరి తలలు మిస్ అవుతాయి. అవి ఎక్కడ ఉన్నాయి? ఏమయ్యాయి? వాళ్ళను ఎవరు చంపారు? అనేది ఎవరికీ తెలియదు. పద్దెనిమిది ఏళ్ళుగా ఎవరూ కంప్లైంట్ కూడా చేయలేదు. మరోవైపు పోలీసులకు ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడం చేత కదా? అని విమర్శలు. ఆ కేసును సాల్వ్ చేయాలని భాస్కర్ రంగంలోకి దిగుతాడు. టైటిల్ పాత్రలో శివ కందుకూరి నటన బావుంది. ఇంటెన్స్ & సస్పెన్స్ క్యారీ చేశారు. చాలా స్టైలుగా కనిపించారు.  


''నీ జాతకం ప్రకారం నువ్వు డిటెక్టివ్ కాలేవురా!'' అని డిజప్పాయింట్ చేసే మాటలు ఒకవైపు... ''ఈ సీరియల్ కిల్లర్ వల్ల నన్ను ఎవరూ డిటెక్టివ్ అంటే నమ్మడం లేదు'' అని హీరో ఫ్రస్టేషన్ మరోవైపు... అసలు క్లూస్ ఏం దొరక్కుండా జాగ్రత్త పడుతున్న సీరియల్ కిల్లర్ ఇంకోవైపు... 'భూతద్దం భాస్కర్ నారాయణ' టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.


శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' (Bhootadham Bhaskar Narayana). పురుషోత్తం రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రాశి సింగ్‌ (Rashi Singh) కథానాయిక. వర్షిణి (varshini sounderajan), దేవి ప్రసాద్, శివ కుమార్ కీలక పాత్రలు చేశారు. యువ హీరో తేజా సజ్జా (Teja Sajja) టీజర్ విడుదల చేశారు.  


టీజర్ మొత్తంలో కిల్లర్ ఎవరనేది చూపించకుండా దర్శకుడు పురుషోత్తం రాజ్‌ సస్పెన్స్ మైంటైన్ చేశారు. ''తొమ్మిదో రోజు... తొమ్మిదో నెల... తొమ్మిది గంటలకు... ఇంకో మర్డర్ జరిగింది'', ''దేవుడి గదిలో దిష్టిబొమ్మా?'' డైలాగులు మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. మార్చి 31న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు వెల్లడించారు.


Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్   



''గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగే ఒక డిటెక్టివ్‌ కథతో 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' రూపొందుతోంది. థ్రిల్‌ కలిగించే ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్‌, సాంగ్స్‌ విడుదల తేదీలు వెల్లడిస్తాం'' అని నిర్మాతలు పేర్కొన్నారు. 


Also Read : ఆదివారం ఉదయం 'దర్శన', సాయంత్రం కిరణ్ అబ్బవరం 'బ్రేకప్ పార్టీ'


దేవీప్రసాద్‌, శివకుమార్‌ పోలీస్ రోల్స్ చేయగా... వర్షిణి మెడిసిన్ ప్రొఫెషన్ కి సంబంధించిన రోల్ చేసినట్టు తెలుస్తోంది. షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూప లక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్‌ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి  శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు.