UP Crime News: బలవంతంగా ఇంటికి తీసుకెళ్తున్నాడనే కోపంతో భర్త నాలుకను తన నోటితోనే కొరికేసిందో భార్య. నాలుక పూర్తిగా తెగిపోవడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కేు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూ జిల్లాకు చెందిన సల్మా, మున్నా భార్యభర్తలు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే వీరిద్దరి మధ్యా గతకొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య సల్మా పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. కొంతకాలంగా అక్కడే ఉంటోంది. ఈ క్రమంలోనే భార్యా, పిల్లలను తన ఇంటింకి తీసుకెళ్లేందుకు మున్నా అత్తింటికి వచ్చాడు. భర్తతో వెళ్లడానికి సల్మా నిరాకరించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తురాలైన భార్య,.. భర్త మున్నా నాలుకను తన నోటితో కొరికేసింది. నాలుక కింద తెగి పడగా.. మున్నా స్పృహ తప్పి పడిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని... మున్నాను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకొని సల్మాను కస్టడీలోకి తీసుకున్నారు. 


భార్యతో సంబంధం ఉందనుకొని వ్యక్తి హత్య


ఓ వ్యక్తికి తన భార్యతో స్నేహం ఉంది. అయితే అది వివాహేతర సంబంధమేమోనని భావించిన భర్త.. అతడిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యకు చెప్పి అతడికి ఫోన్ చేయించి మరీ ఇంటికి రప్పించాడు. ఆపై ఫుల్లుగా మద్యం తాగించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి మూడు సంచుల్లో వేసి మూట కట్టాడు. ఓ సంచిని తీసుకెళ్లి బయట పడేశాడు. మిగిలినవి కూడా పడేసే లోపే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి మృతదేహాన్ని గుర్తించారు. ఆపై పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


అసలేం జరిగిందంటే..?


ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో మిలాల్ ప్రజాపతి అనే వ్యక్తి రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న రాజస్థాన్ లోని కోట్ పుట్లీకి చెందిన అక్షయ్ కుమార్, తన భార్య మధ్య వివాహేతర సంబంధం ఉందని అతను అవమానించాడు. ఈ క్రమంలోనే అతడిపై పగ పెంచుకున్నాడు. ఆ విషయం భార్యకు చెప్పకుండానే.. గురువారం రోజు అతడిని ఇంటికి రమ్మని పిలవాలని భార్యతో చెప్పాడు. ఆమె ఫోన్ చేసి చెప్పడంతో అతడు ఇంటికి వచ్చాడు. అయితే కుమార్తెకు కాలిన గాయాలు కావడంతో చికిత్స కోసం ప్రజాపతి భార్య ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే ఇంటికి వచ్చిన అక్షయ్ కుమార్ ప్రజాపతి మద్యం తాగించాడు. 


ఆ తర్వాత రాత్రి వేళ గొడ్డలితో దాడి చేసి అతడిని హత్య చేశాడు. అక్షయ్ మృతదేహాన్ని  15 ముక్కలుగా చేశాడు. వాటిని మూడు బ్యాగుల్లో ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటకు తన రిక్షాలో తీసుకెళ్లి ఖోడా కాలనీ ప్రాంతంలో పడేశాడు. మరోవైపు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్షయ్ మృతదేహాం ముక్కలు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. నిందితుడు ప్రజాపతిని గురించి అతడిని అరెస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ హత్యలో నిందితుడి భార్య పాత్ర ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.