టీవీలో 'బిగ్ బాస్' సృష్టించిన, సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు... జస్ట్ తెలుగు టీవీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ రియాలిటీ షో సక్సెస్ సాధించింది. స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఇప్పుడు తెలుగులో 'బిగ్ బాస్' సీజన్ 6 (Bigg Boss Season 6) నడుస్తోంది. దీనికి టీఆర్పీ తక్కువ ఉందనేది రేటింగ్స్ చూస్తే తెలుస్తోంది. దీనిపై నాగార్జున స్పందించారు. 


'ది ఘోస్ట్' సినిమా (The Ghost Movie) విజయ దశమి కానుకగా థియేటర్లలో విడుదల అవుతోంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్, తమిళ్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. రెస్పాన్స్ చూసి హిందీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తెలుగు మీడియాతో సమావేశం అయ్యారు. అప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 6 రేటింగ్స్ ప్రస్తావన వచ్చింది. నాగార్జున ఏమన్నారో ఆయన మాటల్లో... 


Nagarjuna On Bigg Boss Ratings : ''రేటింగ్స్ వచ్చినప్పుడు నేను షాక్ తిన్నాను. లాస్ట్ సీజన్స్ కంటే తక్కువ ఉన్నాయి. నేను హ్యాపీగా లేను. ఆ విషయం స్టార్ మా వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఏమో చాలా హ్యాపీగా ఉన్నామన్నారు. ఎందుకు? అని అడిగా. నా దగ్గరకు లెక్కలు తీసుకు వచ్చారు. ఇంతకు ముందు ఆడియన్స్ అందరూ ఎక్కువగా టీవీ చూసేవారు. ఇప్పుడు టీవీ కొంత మంది చూస్తే... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో కొంత మంది చూస్తున్నారు. లేటెస్ట్ 'బిగ్ బాస్' సీజన్ వల్ల స్టార్ మా యాప్ స‌బ్‌స్క్రిప్ష‌న్స్‌ పెరిగాయని వివరించారు. అప్పుడు నేను కొంత కుదుట పడ్డాను'' అని నాగార్జున తెలిపారు. ఒకానొక సమయంలో రేటింగ్స్ చూసి షో మానేయాలని ఆయన భావించినట్టు గుసగుస. 


ప్రస్తుతం 'బిగ్ బాస్ 6'కి టీవీ పరంగా రేటింగ్స్ తక్కువ అయినప్పటికీ... యాప్ పరంగా చూసుకుంటే రెవెన్యూ ఎక్కువ ఉందట. సో... 'స్టార్ మా' వాళ్ళు హ్యాపీ. 


ఐదారు సీజన్స్ తర్వాతే...
'బిగ్ బాస్' షో ఎప్పుడైనా ఐదారు సీజన్స్ తర్వాత క్లిక్ అవుతుందని కింగ్ అక్కినేని నాగార్జున వివరించారు. షోలో కంటెస్టెంట్లకు ఆడియన్స్ కనెక్ట్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ఆయన తెలిపారు. ఎవరి క్యారెక్టర్ ఏమిటి? ఎవరి ఆట ఏమిటి? అనేది ప్రేక్షకులకు అర్థం అయిన తర్వాత రేటింగ్స్ ఎక్కువ వస్తాయనేది కింగ్ చెప్పే మాట. 


Also Read : ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం


'ది ఘోస్ట్' విషయానికి వస్తే... చాలా కొత్తగా ఉంటుందని, ఎప్పటి నుంచో యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నాని, 'గరుడవేగ' చూసిన తర్వాత అటువంటి సినిమా చేస్తే బావుంటుందని ప్రవీణ్ సత్తారును పిలిపించి మాట్లాడానని, తనతో నాలుగైదు నెలలు ట్రావెల్ చేసిన తర్వాత మంచి కథతో ప్రవీణ్ తన దగ్గరకు వచ్చారని నాగార్జున వివరించారు. 'శివ' సినిమాకు ఎంత పేరు వచ్చిందో, ఈ సినిమాకు అంత పేరు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 


Also Read : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?