Nagarjuna's Naa Saami Ranga area wise distribution rights details: సంక్రాంతి బరిలో అందరి కంటే ఆలస్యంగా థియేటర్లలోకి వస్తున్న కథానాయకుడిగా కింగ్ అక్కినేని నాగార్జున. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'నా సామి రంగ'. ఈ ఆదివారం (జనవరి 14న) థియేటర్లలోకి వస్తుందీ సినిమా. సంక్రాంతి సినిమాల్లో అన్నిటి కంటే లోయస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ సినిమాకు జరిగింది. ఎన్ని కోట్లకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు? ఏ ఏరియా రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయి? లాభాలు రావాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? అనేది చూస్తే...
'నా సామి రంగ' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ జస్ట్ 18.5 కోట్లకు ఇచ్చేశారు 'నా సామి రంగ' మేకర్స్! ఏరియాల వారీగా చూస్తే...
- నైజాం (తెలంగాణ) - రూ. 5 కోట్లు
- సీడెడ్ (రాయలసీమ) - రూ. 2.5కోట్లు
- ఆంధ్ర (అన్ని ఏరియాలు కలిపి) - రూ. 8 కోట్లు
- ఏపీ, టీజీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో - రూ. 15.50కోట్లు
- కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా - రూ. 1 కోటి
- ఓవర్సీస్ - రూ. 2 కోట్లు
- టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 18.50 కోట్లు
థియేట్రికల్ రైట్స్ ద్వారా జస్ట్ 18.5 కోట్లు మాత్రమే వచ్చినప్పటికీ... డిజిటల్ అండ్ శాటిలైట్స్ ద్వారా నిర్మాతకు సుమారు 33 కోట్లు వచ్చాయి. దాంతో బడ్జెట్ రికవరీ కావడం కష్టం కాలేదు. డిజిటల్ రైట్స్ విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ కావడంతో డీల్ వెంటనే క్లోజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో పోటీ ఉండటంతో తక్కువ రేటుకు రైట్స్ ఇవ్వమని నిర్మాత శ్రీనివాస చిట్టూరికి నాగార్జున చెప్పారట.
Also Read: డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే 'సైంధవ్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి - ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతికి 'నా సామి రంగ'
'నా సామి రంగ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ తీసుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ వేరొకరికి ఇచ్చారట. మొత్తం మీద నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు సుమారు 32 కోట్ల రూపాయలు వచ్చాయని టాక్.
Also Read: క్రేజ్ ఎక్కువ, బిజినెస్ తక్కువే - 'హనుమాన్'ను ఎన్ని కోట్లకు అమ్మారంటే?
స్టార్ మా, డిస్నీతో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. 'బిగ్ బాస్' రియాలిటీ షోను ఆయన హోస్ట్ చేస్తున్నారు. అది మంచి రేటింగ్స్ రాబడుతోంది. అంతకు ముందు మా టీవీని స్టార్ గ్రూప్ తీసుకోవడానికి ముందు ఆ ఛానల్ యజమానుల్లో నాగార్జున కూడా ఒకరనేది తెలిసిన విషయమే. ఆయన రంగంలోకి దిగడంతో 'నా సామి రంగ' ఓటీటీ, టీవీ రైట్స్ డీల్ ఈజీగా ఓకే అయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో యువ హీరోలు 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ కూడా ఉన్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.