అక్కినేని నాగచైతన్య(Nagachaitanya).. దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. ఈ సినిమాలో కృతిశెట్టి(Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. కథ ప్రకారం.. ఈ సినిమాలో చైతు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. చాలా మంది దర్శకులు చైతుని కలిసి కథలు వినిపిస్తున్నాయి. 


Naga Chaitanya’s Political Drama on Cards: ఈ క్రమంలో రీసెంట్ గా ఓ దర్శకుడు చెప్పిన కథ చైతుకి బాగా నచ్చిందట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. వేణు ఊడుగుల(Venu Udugula). తెలుగులో 'నీది నాది ఒకే కథ', 'విరాటపర్వం' లాంటి సినిమాలను తెరకెక్కించారు వేణు ఊడుగుల. తన నెక్స్ట్ సినిమా నాగచైతన్యతో చేయాలనుకుంటున్నారు. ఈసారి పొలిటిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథను సిద్ధం చేసుకున్నారు. కథ నచ్చడంతో చైతు కూడా గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చైతు ఇలాంటి సినిమాలు చేయలేదు. మరి ఈ కథ అతడికి ఎంతవరకు యాప్ట్ అవుతుందో చూడాలి. 


పొలిటికల్ డ్రామాతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సబ్జెక్ట్ ను నిర్మించడానికి వైజయంతి మూవీస్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ బ్యానర్ నుంచి వస్తోన్న సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. మరి చైతుకి కూడా ఈ సినిమా కలిసొస్తుందేమో చూడాలి. ఈ సినిమాతో పాటు పరశురామ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నారు చైతు. దీనికి 'నాగేశ్వరరావు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మరోపక్క అమెజాన్ ప్రైమ్ కోసం 'దూత' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు నాగచైతన్య. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 


చైతు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా NC22 గురించి చెప్పాలంటే.. ఇందులో 'కార్తీకదీపం' ఫేమ్ ప్రేమి విశ్వనాధ్, ప్రియమణి, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ లాంటి నటీనటులు నటిస్తున్నారు. 


విలన్ గా అరవింద్ స్వామి:
ఈ సినిమాలో అరవింద్ స్వామిని విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద్ స్వామి ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాలో విలన్ గా తన మార్క్ పెర్ఫార్మన్స్ చూపించారు అరవింద్ స్వామి. ఆ తరువాత తెలుగు సినిమాల్లో ఆయనకు అవకాశాలు వచ్చినా.. ఆయన నటించలేదు. చాలా కాలానికి ఆయన మరో తెలుగు సినిమా సైన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. 


వెంకట్ ప్రభు చెప్పిన కథ తనకు నచ్చడంతో అరవింద్ స్వామి నటించడానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రాన్ని హై టెక్నిక‌ల్ స్టాండర్డ్స్‌, భారీ బడ్జెట్‌తో.... కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించ‌నున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Also Read : 'కాంతార' రివ్యూ : ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా ఎలా ఉందంటే?