Pakistan Horror:
పాకిస్థాన్‌లో హాస్పిటల్‌పై శవాలు..
పాకిస్థాన్‌లో ఓ ఘోరం వెలుగు చూసింది. ముల్తాన్‌లోని ఓ హాస్పిటల్‌లో వందలాది మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో పడి ఉండటం భయ భ్రాంతులకు గురి చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. నిష్టార్ మెడికల్ యూనివర్సిటీలో కనిపించాయి ఈ డెడ్‌బాడీస్. డీకంపోజ్ అయిపోయి దారుణమైన స్థితిలో ఉన్నాయి. టాప్‌ఫ్లోర్‌పై వీటిని గుట్టలు గుట్టలుగా పడేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...మొత్తం 500కిపైగా మృతదేహాలుంటాయని తెలుస్తోంది. దీనిపై...నిష్టార్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌కి సెక్షన్ ఆఫీసర్ లెటర్ రాశారు. "నిష్టార్ హాస్పిటల్ టాప్ ఫ్లోర్‌పై అత్యంత దారుణమైన స్థితిలో వందలాది మృతదేహాలు కనిపించాయి. స్థానిక ప్రజలు దీని గురించి తెలిసి ఆందోళన
చెందుతున్నారు. ఇప్పటికే పై అధికారులు దీనిపై సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు" అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సత్వర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మూడ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈ డెడ్‌బాడీస్‌కు సంబంధించిన వీడియోలు కొందరు షేర్ చేశారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి కూడా దీనిపై సీరియస్‌గా ఉన్నారు. సత్వర విచారణకు ఆదేశించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సౌత్ పంజాబ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ 6గురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని నియమించింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే...దాదాపు అన్ని డెడ్‌బాడీస్‌లోనూ ఛాతిపై తీవ్రగాయాలున్నాయి. కొన్ని అవయవాలు కనిపించలేదు. పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సలహాదారు హాస్పిటల్‌ని సందర్శించారు. వీలైనంత వేగంగా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు.