Nag Ashwin About Rajamouli And Ram Gopal Varma Cameo Roles In ‘Kalki 2898 AD’: దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. కనీవినీ ఎరుగని వసూళ్లతో దూసుకెళ్తోంది. దిగ్గజ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాపై హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్, సినిమాకు సంబంధించి, సినిమాలో నటించిన యాక్టర్ల గురించి కీలక విషయాలు వెల్లడించారు.  


రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ చాలా సాయం చేశారు- నాగ్ అశ్విన్


‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కామియో రోల్స్ పోషించాలని దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మను అడగగానే ఒప్పుకున్నారని నాగ్ అశ్విన్ తెలిపారు. “నేను రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ గారిని ఈ సినిమాలో నటించాలని కోరాను. వారు వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమాకు వారు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. వారుఎంతో సపోర్టు చేశారు” అని వివరించారు.


ఆ పాత్రకు అమితాబ్ తప్ప మరెవరూ సూట్ కారు- నాగ్ అశ్విన్


‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సంబంధించి కథ రాయడంతో పాటు నటీనటుల ఎంపిక విషయంలోనూ చాలా సవాళ్లను ఎదుర్కొన్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. “‘కల్కి 2898 ఏడీ’ కథ రాయడానికి చాలా టైం పట్టింది. నటీనటుల సెలెక్షన్ లోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పటి వరకు మేం చేసిన సినిమాల్లో.. ఇదే అత్యధిక వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత ఉన్న సినిమా. ఈ సినిమా కోసం నాలుగు ఏండ్లు చాలా శ్రమించాం. ఈ సినిమా క్లైమాక్స్ సవాల్ గా నిలిచింది. వందల మంది ఆర్టిస్టులు, కష్టమైన గ్రాఫిక్స్ కావాలి. వాటన్నింటినీ సొంతంగా రూపొందించుకున్నాం. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నాం. ఇందులో అత్యంత కీలకమైన అశ్వత్థామ పాత్రలకు అమితాబ్ తప్ప మరెవరూ సూట్ కారని భావించాం. ఈ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేయగలరనుకున్నాం. అమితాబ్‌, ప్రభాస్‌ మధ్య యాక్షన్ సీక్వెన్స్ చేయాలనేది నా ఆశయం. అనుకున్నట్లుగానే అద్భుతంగా తెరకెక్కించాం. అగ్ర నటులు ఈ సినిమాకు ఓకే చెప్పగానే ఎంతో సంతోషించాం” అని వివరించారు.  


ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లు వసూళు చేసిన ‘కల్కి 2898 ఏడీ’


అటు ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పురాణాలకు, టెక్నాలజీని జోడించి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్, దీపికా పదుకొణెతో పాటు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీ దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.  



Also Read: విజ‌య దేవ‌ర‌కొండ ఏం త‌ప్పు చేశాడ‌ని ట్రోల్ చేశారు? నివేద థామ‌స్ లావైతే వాళ్ల‌కెందుకు - రాజీవ్ క‌న‌కాల‌