Mamata Banerjee walked out of the NITI Aayog meeting : ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇరవై నిమిషాలకుపైగా మాట్లాడారని.. తన మైక్ ను మాత్రం మధ్యలోనే కట్ చేశారని మమతా బెనర్జీ సమావేశం నుంచి మధ్యలో బయటకు వచ్చిన తర్వాత ఆరోపించారు. సమావేశంలో ఇతర ముఖ్యమంత్రులు 15 నిమిషాలు మాట్లాడారన్నారు. తనని మాట్లాడకుండా కేంద్ర కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాగే వెంటనే ఈ నీతి ఆయోగ్ ను రద్దు చేసి.. దాని స్థానంలో తిరిగి ప్లానింగ్ కమిషన్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాని ఏడు రాష్ట్రాలు
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. అలాగే ఇండీ కూటమి నుంచి ఒక్క మమతా బెనర్జీ మాత్రమే హాజరయ్యారు. మొత్తంగా ఏడు రాష్ట్రాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతినిధులు రాలేదు. బీహార్ నుంచి డిప్యూటీ సీఎంలు వచ్చారు. సీఎం నితీష్ కుమార్ హాజరు కాలేదు.
సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ మరో టాస్క్ - అక్కడా సక్సెస్ అయితే సంచలనమే
బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని ప్రధానంగా ఆరోపణలు
వాకౌట్ తర్వాత మమతాబెనర్జీ మోదీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ విషయంలో బెంగాల్‌నూ అవమానించారని.. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. బడ్జెట్ సమావేశానికి ఇండియా కూటమి ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడానికి ఇదే కారణం. తమ రాష్ట్రాలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
వాకౌట్ చేస్తానని ఒక రోజు ముందే చెప్పిన మమతా బెనర్జీ
నిజానికి మమతా బెనర్జీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చినప్పుడే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో కొద్దిసేపే ఉంటానని చెప్పారు. బెంగాల్ తో పాటు ఇతర రాష్ట్రాలపై చూపిస్తున్న వివక్షను ప్రశ్నిస్తానని.. అడ్డుకుంటే.. వాకౌట్ చేస్తానని ప్రకటించారు. అంటే వాకౌట్ చేయాలని ఆమె ముందుగానే నిర్ణయించుకున్నారని భావిస్తున్నారు. బీహార్, బెంగాల్ ఝార్ఖండ్, అస్సాంలను రాష్ట్రాలను విభజించే కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు.