సినిమా పరిశ్రమలో  హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్ డాల్స్ గానే చూస్తారు. మసాలా ఎలిమెంట్స్ ను జోడించడానికే ఉపయోగించుకుంటారు. అయితే, అన్నిసార్లు ఇదే ఫార్ములా వర్కౌట్ కాదు. కొన్నిసార్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అద్భుత విజయాలను అందుకున్న సందర్భాలున్నాయి. తాజాగా బాలీవుడ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఫాలోయింగ్ ఉంటేనే ప్రాధాన్యత..


తాజాగా ఓ చానెల్.. హీరోయిన్లతో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ నిర్వహించింది.  నిమ్రత్ కౌర్, హుమా ఖురేషి, మృణాల్ ఠాకూర్ తో పాటు విద్యాబాలన్ బాలీవుడ్‌లో కాస్టింగ్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. సినిమాలను బాగా బిజినెస్ చేసుకునే విషయంలో కాస్టింగ్ టీమ్స్ అత్యంత ప్రభావాన్ని చూపించే వారికి ఎలాంటి ప్రధాన్యత ఇస్తారో వివరించారు. ఆయా హీరోయిన్ల మూలంగా ఎలా ఎక్కువ లాభాన్ని పొందాలి? కమర్షియల్ గా ఎలా విజయాన్ని అందుకోవాలి? అని ఆలోచిస్తారని చెప్పారు. నిజం చెప్పాలంటే మంచి నటీనటుల కంటే ఇన్‌ఫ్లుయెన్సర్లకే ఎక్కువ ఇంపార్టెన్సీ ఇస్తారని వెల్లడించారు. గతంలో తనకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేనందున ఓ సినిమా నుంచి ఎలా తొలగించబడిందో మృణాల్ వెల్లడించింది. తన స్థానంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటిని తీసుకున్నట్లు వివరించింది.


నాకూ అలాంటి అనుభవం ఎదురైంది- విద్యాబాలన్


ఒకానొక సమయంలో తనకూ అలాంటి అనుభవం ఎదురైందని విద్యా బాలన్ వివరించారు. ఒక సినిమా కోసం వెళ్లినప్పుడు మీకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు? అని అడిగినట్లు చెప్పారు. ఈ రోజుల్లో నటీనటులకు ఫాలోయింగ్ బాగానే ఉందని హ్యూమా  వెల్లడించింది. అయితే, సినిమా విజయం విషయంలో సోషల్ మీడియా ప్రభావం ఒక్కటే సరిపోతదని చెప్పింది.  ఈ రోజుల్లో ఆయా బ్రాండ్లు ఎక్కువ అభిమానులున్న నటీనటుల వెంటే తిరుగుతున్నాయి హీరోయిన్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారికే ఆయా బ్రాండ్లు ఎక్కువ అమౌంట్ ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నాయని చెప్పారు. సినిమా నిర్మాతలు కూడా తమ చిత్రాలలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లను తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు.   


హీరోలకు ధీటుగా నటించిన హీరోయిన్లు


వాస్తవానికి గతంతో పోల్చితే హీరోయిన్ల  ఎంపిక విషయంలో చాలా మార్పులు వచ్చాయని వివరించారు.  ‘రాజీ అండ్ డార్లింగ్స్‌’లో అలియా భట్, ‘పరిణీత అండ్ కహానీ’లో విద్యాబాలన్, ‘ఏక్ థీ దయాన్‌’లో హుమా ఖురేషి ‘మోనికా’, ‘ఓ మై డార్లింగ్’  లాంటి సినిమాలతో  చక్కటి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు. అంతేకాదు, హీరోలకు గట్టి పోటీ ఇవ్వగల సత్తా ఉందని నిరూపించుకున్నారు.  అయినా, ఇప్పటికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ రాలేకపోతున్నాయన్నారు. ఈ రోజుల్లో ఒక సినిమా కోసం హీరోయిన్ ను ఎంపిక చేయాలంటే సోషల్ మీడియా ఫాలోయింగ్ నే బేస్ చేసుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.


గతంలో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది? అనే విషయాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకునే వారని చెప్పారు. షారుఖ్-కాజోల్, అక్షయ్-రవీనా, గోవింద-కరిష్మ జంటలు ప్రేక్షకులు ఇష్టపడే వారని చెప్పారు. అందుకే అప్పట్లో ‘హిట్ జోడీస్'గా పరిగణించబడ్డారన్నారు.


Read Also: ‘అవతార్‌-2’ మూవీకి అక్షయ్ కుమార్ రివ్యూ: కామెరూన్ ప్రతిభకు తలవంచాల్సిందేనట!