చాలా రోజుల తరువాత మోహన్ బాబు నటించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఇందులో మోహన్ బాబు దేశభక్తి కల వ్యక్తిగా కనిపించన్నారు. ఇది మంచువారి సొంత సినిమా అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నది మంచు విష్ణు. మ్యూజిక్ మాంత్రికుడు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో మోహన్ బాబు నటించిన ఎన్నో సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ పాటలు కూడా ఉన్నాయి. కాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్రనిర్మాతలు. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదల కానుంది. అసలే మోహన్ బాబు తెరపై కనిపించి ఏడేళ్లకు పైగా గడిచింది. దీంతో అతడిని చూడడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడడం ఖాయం. 


ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ గతంలోనే విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘దేశభక్తి అతని రక్తంలోనే ఉంది’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రత్నబాబు. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. 


మోహన్ బాబు 1969లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ కెమెరా వెనుక ఉండి అనేక పాత్రలు పోషించారు. తొలిసారి నటుడిగా మేకప్ వేసుకుంది మాత్రం 1974లో.  కన్నవారి కలలలు, అల్లూరి సీతారామరాజు సినిమాల్లో ఆ ఏడాదిలోనే కనిపించారు. 1978లో ఆయన ప్రధానపాత్రలో చేసిన శివరంజని సినిమా సూపర్ హిట్ కొట్టడంతో అప్పట్నించి వరుస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.







Also read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ చెప్పిన డార్లింగ్... మార్చిలోనే, ఆ రోజే!