Manchu Family Issue: మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !

Manchu Manoj: తన ఆస్తుల నుంచి మనోజ్ ను ఖాళీ చేయించాలని మోహన్ బాబు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో ఖాళీ చేయాలని మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు.

Continues below advertisement

Mohanbabu Vs Manoj:  మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదం లో రోజుకో మలుపు చోటు చేసుకుంటోంది. తాజాగా మనోజ్‌కు మోహన్ బాబు షాక్ ఇచ్చారు. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు ఆరోపించారు. వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని విజ్ఞప్తిచేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు వచ్చేలా చూడాలని  మోహన్ బాబు మేజిస్ట్రేట్‌ను కోరారు. మేజిస్ట్రేట్ నుంచి వచ్చిన సూచనల మేరకు జల్‌పల్లిలో నివాసం ఉంటున్న మంచు మనోజ్ ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్నారు కలెక్టర్. జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. 

Continues below advertisement

మోహన్‌బాబుకు చెందిన జల్‌పల్లి నివాసంలో ఉంటున్న మంచు మనోజ్            

జల్ పల్లిలోని మంచు టౌన్ లో మోహన్ బాబు నివాసం ఉంది. అక్కడే మంచు మనోజ్ ఉంటున్నారు. ఇటీవల చెలరేగిన వివాదం కారణంగా మనోజ్ ను ఇంటి నుంచి పంపించేయాలని మోహన్ బాబు నిర్ణయించుకున్నారు. అయితే జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సి రావడంతో.. ఆ ఇంట్లో మనోజ్ దంపతులు మాత్రమే ఉంటున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన తర్వాత మోహన్ బాబు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడే ఎంబీయూ యూనివర్శిటీలో ఉన్న నివాసంలో ఉంటున్నారు. హైదరాబాద్‌లో మనోజ్ ఉంటున్నారు. 

తిరుపతిలో ఉంటున్న మోహన్ బాబు - తాను వచ్చే సరికి మనోజ్ ఉండకూడదని పట్టుదల       

ఇటీవల మనోజ్ తిరుపతికి కూడా వెళ్లారు.ఎంబీయూ యూనివర్శిటీ దగ్గర వివాదం చెలరేగింది ఈ క్రమంలో ఇరు వర్గాలు పోలీసు కేసులు పెట్టుకున్నాయి. ఈ వివాదంతో అసలు మంచు మనోజ్ కు ఎలాంటి ఆస్తులు ఇవ్వడం కానీ..తన ఆస్తుల్లో ఉండే అవకాశం కానీ ఇవ్వకూడదనుకుంటున్న మోహన్ బాబు ఈ మేరుకు న్యాయపరమైన చర్యల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు కలెక్టర్ ద్వారా ఇప్పించిన నోటీసులను మనోజ్ తీసుకున్నారు. ఆయన ఇంటిని ఖాళీ చేస్తారా లేక తాను కూడా.. న్యాయపరమైన అంశాలపై దృష్టి సారిస్తారా అన్నది తెలియాల్సిఉంది. 

కుటుంబ వివాదాలతో రోడ్డున పడిన మంచు కుటుంబం        

మోహన్ బాబు చిన్నకుమారుడు అయిన మంచు మనోజ్, మోహన్ బాబుకు సరిపడటం లేదు. ఆయన నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. అయితే  అది కుటుంబ గొడవ కావడంతో పోలీసులు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. వారు బౌన్సర్లను పెట్టుకుని గందరగోళం చేస్తూండటంతో రాచకొండ కమిషనర్ పిలిచి వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లతో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు.                      

Also Readఒక్కడినే వస్తా, నువ్వు ఎవరితో వస్తావో రా... అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్ 

Continues below advertisement
Sponsored Links by Taboola