Spark Movie Update : మెహరీన్‌తో విక్రాంత్ పాట - ఐస్‌ల్యాండ్‌లో

విక్రాంత్ హీరోగా, మెహరీన్, రుక్సార్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'స్పార్క్'. ఇటీవల ఐస్‌ల్యాండ్‌లో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు.

Continues below advertisement

విక్రాంత్ (Vikranth) కథానాయకుడిగా ప‌రిచ‌యం అవుతున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్' (Spark Movie). డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ఐస్‌ల్యాండ్‌లోని అందమైన లొకేషన్లలో హీరో హీరోయిన్లపై పాటలు తెరకెక్కించారు.
  
ఐస్‌ల్యాండ్‌లో అందాలు హైలైట్‌గా...
విక్రాంత్, మెహరీన్ కౌర్ ఫిర్జాదాపై ఐస్‌ల్యాండ్‌లో పాటలు తెరకెక్కించినట్టు చిత్ర బృందం వెల్లడించింది. అక్కడ లొకేషన్లు, సాంగ్ ట్యూన్ హైలైట్ అవుతాయని యూనిట్ సభ్యులు తెలిపారు.
 
మెహరీన్‌తో పాటు రుక్సార్ కూడా!
'స్పార్క్'లో విక్రాంత్ జోడీగా ఇద్దరు అందమైన భామలు నటిస్తున్నారు. మెహరీన్ కౌర్ ఫిర్జాదా (Mehreen Kaur Pirzada) కాకుండా సినిమాలో మరో భామ ఉన్నారు. ఇందులో 'ఏబీసీడీ', 'అశోక వనంలో అర్జున కళ్యాణం' ఫేమ్ రుక్సార్ థిల్లాన్ (Rukshar Dhillon) మరో కథానాయిక. 'ఎఫ్ 3'తో ఈ ఏడాది మెహరీన్ ఓ విజయం అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమె చేస్తున్న చిత్రమిది.

Continues below advertisement

తెలుగుకు వస్తున్న 'హృదయం' సంగీత దర్శకుడు!
'స్పార్క్' చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణీ ప్రియదర్శన్, దర్శన నటించిన మలయాళ సూపర్ హిట్ సినిమా 'హృదయం' (Hridayam Movie) చిత్రానికి ఆయన అందించిన పాటలు భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'స్పార్క్'తో పాటు విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' సినిమాకు కూడా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.

ఐస్‌ల్యాండ్‌ టు మున్నార్, విశాఖ!
ఐస్‌ల్యాండ్‌లో నుంచి 'స్పార్క్' యూనిట్ తిరిగి వచ్చిన తర్వాత మున్నార్, విశాఖలో షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. లొకేషన్స్ పరంగా 'స్పార్క్' టీమ్ ఎక్కువగా హిల్ స్టేషన్స్ ఎంపిక చేసుకుంటున్నారు. ఐస్‌ల్యాండ్‌ వెళ్ళడానికి ముందు హైద‌రాబాద్‌లోని సార‌థి స్టూడియోలో వేసిన రెండు భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

Also Read : కడుపులో బిడ్డతో సమంత పోరాటం - కలియుగ పద్మవ్యూహంలో 'యశోద', ట్రైలర్ చూశారా?

విలన్‌గా గురు సోమసుందరం
మలయాళంలో రూపొందిన సూపర్ హీరో సినిమా 'మిన్నల్ మురళి'. అందులో టీ షాపులో పని చేసే వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తాయి చూడండి! ఆ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన గురు సోమసుందరం (Guru Somasundaram) గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నారు. అదీ ప్రతినాయకుడిగా! విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నమాట! 
  
'స్పార్క్' సినిమాలో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, 'వెన్నెల' కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర సహాయకుడిగా పని చేసిన రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Continues below advertisement