మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. ఫ్లైట్ లో ఈ ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ కనిపించారు. 'గాడ్ ఫాదర్' ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అని ఒక్క మాటలో సినిమా గురించి చెప్పేశారు. 


సినిమాలో హీరోయిన్ లేదని కానీ.. ఎక్కువ సాంగ్స్ లేవని అలాంటి ఆలోచన రాకుండా చేసే సబ్జెక్ట్ 'గాడ్ ఫాదర్' అని చెప్పారు. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆరో ప్రాణమని అన్నారు. పూర్తి ఇంటర్వ్యూ సెప్టెంబర్ 25న విడుదలవుతుందని ప్రకటించారు. మలయాళ 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారట.


Netflix bags the Digital Rights of God Father: మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నారు. రీసెంట్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకి ఈ హక్కులను అమ్మారట. ఎంత మొత్తమనేది బయటకు రాలేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ను అనంతపూర్ లో నిర్వహించాలనుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. 


ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.



Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?


Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?