మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటివరకు విడుదలైన సినిమా ప్రచార చిత్రాలు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం ముందుగానే బయటకొచ్చింది. ప్రముఖ సెన్సార్ సభ్యులు, క్రిటిక్ ఉమర్ సంధు 'ఆచార్య' సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చిరంజీవి, రామ్ చరణ్ ల కాంబినేషన్ మాస్ ఆడియన్స్ కు లార్జ్ డోస్ ఎంటర్టైన్మెంట్ అని.. సినిమాలో మసాలా ఓ రేంజ్ లో ఉంటుందని.. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అన్నారు.
ఈ సినిమా గేమ్ రూల్స్ ను తిరగరాస్తుందని.. ఈద్ ఫెస్టివ్ సీజన్ లో మంచి సినిమా అని చెప్పుకొచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ నిడివి 45 నిమిషాలు ఉంటుందట. సినిమా మొదలైన ఇరవై నిమిషాల తరువాత చిరంజీవి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ప్రీ ఇంటర్వెల్ వరకు కాస్త స్లోగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందని అంటున్నారు.
ఆ తరువాత రామ్ చరణ్ క్యారెక్టర్ సిద్ధ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయని.. సిద్ధ లక్ష్యం కోసం చిరు పోరాడే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తిరు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఎసెట్స్ గా నిలవనున్నాయి. ఈ సినిమాలో పూజాహెగ్డే మరో కీలకపాత్రలో కనిపించనుంది.
Also Read: మీ సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? - చిరంజీవి సమాధానం ఏమిటంటే?
Also Read: 'జబర్దస్త్'కు జడ్జ్ కావలెను, రోజాను రీప్లేస్ చేసేది ఎవరు?