మెగా హీరోలంటే తెలుగు ప్రేక్షకుల్లో మామూలు క్రేజ్ కాదు, అందులోనూ వారంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా. క్రిస్మస్ సందర్భంగా మెగా యూత్ అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్క చోట చేరి పార్టీ చేసుకున్నారు. అలాగే ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పారు. మెగా కజిన్స్ ఫోటో పెట్టారంటే మెగా అభిమానులకు కనుల పండుగే. ఆ ఫోటో లైకుల్లో, షేర్లలో దూసుకెళ్లిపోతుంది. తాజా ఫోటోలో హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఉన్నారు. అలాగే ఉపాసన, స్నేహారెడ్డి, శ్రీజ, సుస్మిత, అల్లు బాబీ భార్య, నిహారిక కూడా ఉన్నారు. సుస్మిత భర్త, నీహారిక భర్త కూడా ఫోటోలో కనిపిస్తున్నారు.
ఆయనెక్కడ?
శ్రీజ భర్త, మరో మెగా హీరో అయిన కళ్యాణ్ దేవ్ మాత్రం కొన్నాళ్లుగా ఏ ఫోటోలోనూ కనిపించడం లేదు. గతంలో కూడా చాలా వేడుకల్లో కళ్యాణ్ కనిపించలేదు. శ్రీజ-కళ్యాణ్ మధ్య విబేధాలు వచ్చినట్టు టాక్ వచ్చింది. వారిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మెగా వేడుకల్లో కళ్యాణ్ కనిపించకపోయేసరికి అదే నిజమనే వాదనలు పెరుగుతున్నాయి. దీపావళి వేడుకల్లో కూడా కళ్యాణ్ కనిపించలేదు. సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక మెగా హీరోలందరూ అతనితో ఫోటో దిగారు. అందులో కూడా ఈ కుర్ర హీరో లేడు.
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి