మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ మాత్రమే కాదు... కెరీర్ బెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అందించిన సినిమాగా 'ధమాకా' (Dhamaka Collections) నిలుస్తుందని చెప్పవచ్చు. ఏడు రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. రవితేజకు సూపర్ డూపర్ కమర్షియల్ సక్సెస్ అందించింది.


రవితేజ సరసన శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటించిన 'ధమాకా' (Dhamaka Movie) డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. నిన్నటి (డిసెంబర్ 29)కి సినిమా విడుదలై వారం అన్నమాట. మాస్ మహారాజా నుంచి సగటు అభిమాని, తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటారో? ఆ అంశాలన్నీ ఉన్న సినిమా 'ధమాకా' అని పేరు తెచ్చుకుంది. మౌత్ టాక్ కూడా యాడ్ అవ్వడంతో వసూళ్ళ పరంగా దుమ్ము లేపింది. 


'ధమాకా' @ 62 కోర్స్! 
'ధమాకా' ఐదో రోజున 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఆరు రోజులకు 56 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా... ఏడో రోజు మరో 6 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీక్ మొత్తం మీద చూస్తే... 62 కోట్లు కలెక్ట్ చేసింది. 


'ధమాకా' తొలి రోజు పది కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. ఆదివారం రాబట్టిన వసూళ్ళలో సోమవారం సగం వస్తే గొప్ప అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. కానీ, 'ధమాకా' అలా కాదు... నాలుగో రోజు కూడా దుమ్ము లేపింది. మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 'ధమాకా'... నాలుగో రోజు 42 ప్లస్ కోర్స్ కలెక్ట్ చేసింది.


Also Read : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్‌ చేసిన ప్రభాస్ 






'ధమాకా'కు ముందు ఈ ఏడాది రవితేజ నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఈ ఏడాది రవితేజకు విజయం వస్తుందా? లేదా? 'ధమాకా' వసూళ్ళు రవితేజ పరీక్ష పెడతాయి? వంటి మాటలు విడుదలకు ముందు వినిపించాయి. ఆ అనుమానాలు అన్నిటినీ మాస్ మహారాజా పటాపంచలు చేశారు.


త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన 'ధమాకా'కు బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. ఈ సినిమాకు 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది.


Also Read : టాప్ గేర్ రివ్యూ: ఆది సాయికుమార్ సినిమా టాప్ గేర్‌లో దూసుకుపోయిందా? 


'ధమాకా' విజయంతో 2022కి వీడ్కోలు పలుకుతున్న రవితేజ... సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన ఆ సినిమాలో నటించారు. అది కాకుండా ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు రవితేజ. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'ఈగల్' టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఉంది. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.



Also Read : 'లక్కీ లక్ష్మణ్' రివ్యూ : 'బిగ్ బాస్' సోహైల్ సినిమా ఎలా ఉందంటే?