సమంత-నాగచైతన్య విడాకుల విషయంపై చర్చ ఇప్పట్లో ఆగేలా లేదు. సెలబ్రెటీలు, అభిమానుల రియాక్షన్స్ పై చర్చ ఓవైపు..సోషల్ మీడియాలో సామ్ పోస్టులు, స్టేటస్ పై చర్చ మరోవైపు. విడిపోతున్నామని తప్ప తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ చైతూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టలేదు. సమంత మాత్రం తన మనసులో భావాలను కొటేషన్ల రూపంలో పంచుకుంటూనే ఉంది. తాజాగా పెళ్లిరోజు సందర్భంగా సామ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 






పాత ప్రేమ పాటలు, పర్వతాలు.. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో మెలంచోలిక్ ప్రతిధ్వని ధ్వని, పాత ప్రేమికుల పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు, సందుల్లో గాలి శబ్దం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. తెల్ల‌ని డ్రెస్ వేసుకుని నేల‌వైపు చూస్తూ ఒంటరిగా న‌డుస్తున్న ఫొటో షేర్ చేసింది సమంత. దాదాపు పదేళ్లుగా వీరి మధ్య పరిచయం ఉంది. ఆ తరువాత ఒకరినొకరు ఇష్టపడి.. పెద్దలను ఒప్పించి.. ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది.



వీరిద్దరూ కలిసి ఉంటే ఈ రోజున వీరు నాల్గో వివాహా వార్షికోత్సవం జరుపుకునేవారు. కానీ సమంత పెళ్లిరోజుకి ముందుగానే సెపరేషన్ విషయం అనౌన్స్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకే పెళ్లిరోజు కంటే ముందే విడిపోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు.  అయితే గడిచిన మూడేళ్లలో  పెళ్లిరోజున భర్త నాగచైతన్యపై సమంత కురిపించిన ప్రేమ.. సోషల్ మీడియాలో షేర్ చేసిన సందేశాలను తిరగేస్తూ.. వాటి గురించి చర్చించుకుంటున్నారు అభిమానులు. 


Also Read: చై-సామ్ పెళ్లి రోజు.. మూడేళ్లుగా సమంత పెట్టిన పోస్ట్ లు వైరల్..
Also Read: పింకీకి మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్, భావోద్వేగంలో బిగ్ బాస్ హౌస్
Also Read:ప్రభాస్ 25 వ చిత్రం ఆ హిట్ దర్శకుడితోనే, సినిమా పేరేంటంటే..
Also Read: ‘చెట్టెక్కి పుట్టతేనే...’ కొండపొలం నుంచి మరో కత్తి లాంటి సాంగ్
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి