ప్రభాస్ ప్రస్తుతం సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్ సినిమా చేసేందుకు అంగీకరించారు. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసే సినిమా 24వది అవుతుంది. ఆ సినిమా తరువాత ఆయన చేయబోయే సినిమాపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రభాస్ తన 25వ సినిమా ఎవరితో చేస్తారా అని తెగ ఆత్రుతగా ఎదురుచూశారు ఆయన అభిమానులు. ఆ ఎదురు చూపులకు తెరపడింది. అర్జున్ రెడ్డి సినిమా అద్భుతంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి వంగాకు ఛాన్సు ఇచ్చారు ప్రభాస్. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయి మూవీ. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ ను నిర్ణయించారు. సందీప్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించనుంది. ఇది భారీ యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో తెరకెక్కించనున్నారు. తెలుగుతో పాటూ, తమిళ, కన్నడ, హిందీ, మళయాళం వంటి దేశీ భాషలతో పాటూ చైనీస్, కొరియా, జపాన్ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రభాస్ ప్రపంచస్థాయి హీరోగా మారతారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆది పురుష్, సలార్ ఇంకా షూటింగ్ దశలో ఉన్నాయి. సంక్రాంతి తరువాత నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ 25వ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికి దక్కనుందో.