కొండపొలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోపు సినిమాలోని ఒక్కొక్క పాటను విడుదల చేస్తోంది చిత్రయూనిట్. అక్టోబర్ 8న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుండగా... ఒకరోజు ముందు చక్కటి రొమాంటిక్ సాంగ్ ‘చెట్టెక్కి పుట్ట తేనే పట్టి తెచ్చా మామ’పాట విడుదలైంది. ఇందులో వైష్టవ్ తేజ్, రకుల్ పోటీపడి డ్యాన్స్ చేశారు. వారి కాస్ట్యూమ్స్ కూడా అదిరిపోయాయి. రొమాంటిక్ సాగే లిరిక్స్ తో పాట వినసొంపుగా ఉంది. ఈ పాటను కాల భైరవ, శ్రేయా ఘోషల్ పాడారు.
కొండపొలం నుంచి ‘చెట్టెక్కి’ వీడియో సాంగ్:
ఉప్పెన తరువాత మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్ సినిమా ఇది. దీనిపై చాలా అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. ఇప్పటికే ట్రైలర్లలో చూస్తుంటే వైష్ణవ్ - రకుల్ కెమిస్ట్రీ సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. ఇందులో రకుల్ తొలిసారి డీ గ్లామర్ పాత్రలో నటించింది. పల్లెటూరి అమ్మాయి‘ఓబులమ్మ’గా అలరించబోతోంది. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణమ్మ, హేమ, రవి ప్రకాష్, రచ్చ రవి ఇతర పాత్రల్లో నటించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైనమెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చితాన్ని నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. క్రిష్ సినిమాలు అనగానే సినీ అభిమానులకు భారీ అంచనాలే ఉంటాయి. ఆ అంచనాలను కొండపొలం అందుకుందో లేదో శుక్రవారం తెలిసిపోతుంది.
కొండపొలం సినిమా షూటింగ్ ను దాదాపు వికారాబాద్ అడవుల్లోనే చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ అనే నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు. అందులోనూ వేదం, గమ్యం లాంటి సినిమాలను అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిత్రయూనిట్ మూవీ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. అది చూశాక సినిమా చూడాలన్న కోరిక ఇంకా పెరిగిపోతుంది సగటు ప్రేక్షకుడికి. కొండకోనల్లో గొర్రెలు మేపుకుని బతికే గిరిజనులు ఎదుర్కొనే సవాళ్ల కథాంశంగా ఈ సినిమా రూపొందింది. వైష్ణవ్ పాత్ర ఏంటనేది మాత్రం రివీల్ చేయకుండా ఉంచారు మేకర్స్. రకుల్ మాత్రం గిరిజన యువతి ఓబులమ్మగా పరిచయం అయింది. వైష్ణవ్ ఏదైనా పవర్ ఫుల్ పాత్ర అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు.
Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం
Also read: ఈ ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా? ప్రమాదం తప్పదు