Manoj pushed the gate of Mohan Babu's house and went inside: జల్ పల్లిలోని మంచు టౌన్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి హైడ్రా చోటు చేసుకుంది. మంచు మనోజ్ దంపతులు ఇంటికి వెళ్లే సరికి గేట్ వేసి ఉంది. సెక్యూరిటీ సిబ్బంది గేటు తీసేందుకు నిరాకరించారు. దాంతో గేటు తోసేసుకుని ఆయన లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే మనోజ్ తో పాటు ఆయన భార్య, బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపేసి గేట్లు వేసేశారు. ఆ తర్వాత మంచు మనోజ్ తనకు భద్రత కల్పించాలని పోలీసుల్ని కోరేందుకు వెళ్లారు. ఇంటలిజెన్స్ డీజీ, డీజీపీతో పాటు రాచకొండ కమిషనర్ ను కలిసి తమ కుటుబంంలో వివాదాల గురించి, తనపై జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత నేరుగా ఆయన జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వచ్చారు.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
అయితే అప్పటికే మనోజ్ కు సంబంధించిన సామాన్లను మోహన్ బాబు నాలుగు వాహనాల్లో బయటకు పంపేందుకు మోహన్ బాబు ఏర్పాట్లు చేశారు. మరో వైపు మనోజ్ ను ఇంట్లోకి అనుమతించవద్దని సెక్యూరిటీకి చెప్పారు. దాదాపుగా యాభై మంది బౌన్సర్లను మోహరించారు. అయితే మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు తీయకపోవడంతో గట్టిగా తోసేసుకుని ఆయన లోపలికి వెళ్లారు. ఆయనతో పాటు భార్య మౌనిక.. కొంత మంది సన్నిహితులు కూడా వెళ్లారు.
మనోజ్ , మౌనికలపై మోహన్ బాబు, విష్ణు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రారంభమయింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ కు చెందిన కొంత మంది పోలీసులు లోపలే ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున మంచు విష్ణుకు చెందిన బౌన్సర్లు ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రారంభమయింది.