Manoj Bajpayee: ఎవరు చెప్పారు మీకు? 'పుష్ప'లో పాత్రపై 'ఫ్యామిలీ మ్యాన్' స్పందన ఇది!

మనోజ్ బాజ్‌పాయి 'పుష్ప2'లో భాగమవుతున్నాడనే వార్తలు రాగానే.. అవి వైరల్ అయ్యాయి.   

Continues below advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది. నిజానికి ఈపాటికే సినిమా మొదలవ్వాలి కానీ దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుండడంతో ఆలస్యమవుతుంది. 'పుష్ప' సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమాను రూపొందించాలనుకుంటున్నారు. 

Continues below advertisement

ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నటీనటులు సెకండ్ పార్ట్ లో కూడా కనిపించనున్నారు. అలానే కొన్ని కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతాయని చెబుతున్నాయి. ఈ క్రమంలో విజయ్ సేతుపతి, మనోజ్ బాజ్‌పాయి లాంటి తారలు 'పుష్ప2'లో కనిపిస్తారని వార్తలొచ్చాయి. గతంలో మనోజ్ బాజ్‌పాయి, అల్లు అర్జున్ కలిసి 'హ్యాపీ' సినిమాలో నటించారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మనోజ్ బాజ్‌పాయి రేంజ్ పెరిగిపోయింది. అలాంటి వ్యక్తి 'పుష్ప2'లో భాగమవుతున్నాడనే వార్తలు రాగానే.. అవి వైరల్ అయ్యాయి. 

తాజాగా ఈ విషయంలో మనోజ్ బాజ్‌పాయి స్పందించారు. 'అసలు ఎక్కడ నుంచి మీకు ఇలాంటి అప్డేట్స్ వస్తాయ్..?' అని కామెంట్ చేశారు. అలానే 'పుష్ప2'లో తను నటిస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. 

ఇక 'పుష్ప2'లో మెయిన్ విలన్ గా ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది

Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Continues below advertisement