Manjummel Boys OTT Release: ఇటీవల విడుదలైన మలయాళీ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ సంచలన విజయాన్ని అందుకుంది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులను అపురూప స్పందన లభించింది. దర్శకుడు చిదంబరం ఎస్ పొడువల్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతికి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్?
వాస్తవానికి ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఓటీటీ విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఓటీటీలోకి అడుగు పెట్టే అవకాశం కనిపించడం లేదు. ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా మార్చి 15న తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలయాళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’
2006లో తమిళనాడు కొడైకెనాల్ గుణ గుహల్లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కొంత మంది స్నేహితులు టూర్ లో భాగంగా కొడైకెనాల్ వెళ్లగా, అందులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నాన్ని దర్శకుడు సినిమాగా తెరకెక్కించారు. రెస్క్యూ సిబ్బంది సైతం కాపాడలేమని చెప్పినా, తమ స్నేహితులు అతడిని ఎలా కాపాడుకున్నారో ఇందులో అత్యద్భుతంగా చూపించారు. ఈ సినిమాలోని ప్రతిసీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమా చూస్తున్నట్లుగా కాకుండా, ప్రేక్షకులు లీనం అయ్యేలా రూపొందించారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఇట్టే ఆకట్టుకుంటోంది. శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ ఈ సినిమాలో నటించారు.
‘2018’ కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టేనా?
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మంజుమ్మేల్ బాయ్స్’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర సంచలనాలను క్రియేట్ చేసింది. 12 రోజుల్లో ఏకంగా రూ.100 కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సాధించింది. మలయాళంలో ‘పులిమురుగన్’, ‘లూసిఫర్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. వీటిలో కేరళ వరదలను బేస్ చేసుకుని తెరకెక్కిన ‘2018’ మూవీ రూ.177 కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా ‘2018’ కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also: ఒక్క సినిమాకు రూ.600 కోట్ల రెమ్యునరేషన్, రికార్డు సృష్టించిన హాలీవుడ్ డైరెక్టర్