'జిన్నా' సినిమా (Ginna Movie) విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్ అంశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన చిత్రమిది. తప్పకుండా విజయం సాధిస్తుందని విష్ణు మంచు (Vishnu Manchu) నమ్మకంగా ఉన్నారు. 'జిన్నా' కోసం విష్ణు ప్రత్యేకంగా డ్యాన్స్ రిహార్సిల్స్ చేశారు. ఫైట్స్ కోసం ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేశారు. 


'యాక్షన్ కష్టం అనిపించిందా? డ్యాన్స్ చేయడం కష్టం అనిపించిందా?' అని విష్ణు మంచును అడిగితే... ''డ్యాన్స్ రిహార్సిల్స్ చేయడం, ప్రాక్టీస్ చేయడం క్యాజువల్ గా జరిగింది. అయితే... ప్రభు దేవా కొరియోగ్రఫీ చేసిన సాంగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. వారం రోజులు రిహార్సిల్స్ చేశాం. షూటింగ్ చేయడానికి సెట్ కు వెళ్లిన తర్వాత 90 పర్సెంట్ స్టెప్పులను ప్రభు అన్న మార్చేశారు. ఏమైనా అంటే ఆయన ఏమంటారోనని మౌనంగా చేశా'' అని విష్ణు మంచు తెలిపారు.
 
'జిన్నా'లో విష్ణు మంచు, పాయల్ రాజ్ పుత్ మీద తెరకెక్కించిన 'గోలి సోడా' పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఓ పాటకు ప్రేమ్ రక్షిత్, మరో పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. సన్నీ లియోన్, విష్ణు మంచు మీద తెరకెక్కించిన 'జారు మిఠాయి' పాట, 'నా పేరు జిన్నా' టైటిల్ సాంగు కూడా వైరల్ అవుతున్నాయి.    



హారర్ కామెడీగా రూపొందిన 'జిన్నా'లో హీరో హీరోయిన్లపై యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఒక సన్నివేశంలో హీరోయిన్లతో విష్ణు మంచు ఫైట్ చేశారని తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫైట్ చేసిన తర్వాత పెర్ఫ్యూమ్స్ ఏవీ వర్క్ చేసేవి కాదని, అందరూ శరీరాలు చెమటతో నిండిపోయేవని సమాచారం.


Also Read : 'చంద్రముఖి' టైపులో ప్రభాస్ రోల్ - ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?



'చంద్రముఖి' తరహాలో కామెడీగా...
'చంద్రముఖి' జానర్‌లో 'జిన్నా' ఉంటుందని విష్ణు మంచు తెలిపారు. 'చంద్రముఖి' డార్క్ కామెడీ జానర్ అయితే... అటువంటి చిత్రమే 'జిన్నా' అని ఆయన తెలిపారు. ఆ సినిమాకు మించి కామెడీ 'జిన్నా'లో ఉందన్నారు. అలాగే, థ్రిల్ కూడా ఉంటుందట. దీపావళి కానుకగా ఈ శుక్రవారం 'జిన్నా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి. 


విష్ణు మంచు (Vishnu Manchu) కొన్ని రోజులుగా తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు ట్రోల్స్ చేయిస్తున్నారని ఆ మధ్య ఆయన పేర్కొన్నారు. తాను ఊహించినట్టుగా 'జిన్నా' విడుదలకు ముందు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారని విష్ణు మంచు ట్వీట్ చేశారు.



కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో  AVA ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలపై రూపొందుతోంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ, కోన వెంకట్ స్క్రిప్ట్ అందించారు. కోన క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు, సద్దాం తదితరులు కీలక పాత్రలు చేశారు.