Manchu Brothers have come from offline to online fighting : మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదం అంతంతకూ పెరుగుతోంది. తాజాగా
మంచు బ్రదర్స్ ఇద్దరూ ప్రత్యక్ష బరి నుంచి సోషల్ మీడియా బరిలోకి దిగారు. ఇద్దరూ పోటాపోటీగా తండ్రి నటించిన సినిమాల్లోని క్లిప్పులను పోస్టు చేసుకుంటూ పరస్పర వార్నింగులు ఇచ్చుకుంటున్నారు. ఉదయం తండ్రి మోహన్ బాబు నటించిన 'రౌడీ' సినిమాలో డైలాగ్‌ను 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేసిన విష్ణు.. తనకు ఈ డైలాగ్ అంటే చాలా ఇష్టమంటూ కామెంట్ చేశారు. అది నేరుగా ప్రస్తుతం మంచు మనోజ్ ను ఉద్దేశించి చేసినట్లుగా ఘాటుగా ఉంది.
విష్ణు తనను అవమానించారని నిర్దారణ కావడంతో మంచు మనోజ్ జ్ స్పందించారు. 'భక్త కన్నప్ప'లో కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందని.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావని ట్వీట్ చేశారు.
'ఎక్స్' వేదికగా ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. తాను వవిష్ణును ఉద్దేశించే అన్నట్లుగా తెలిసేలా విస్‌స్మిత్ అనే హ్యాష్ ట్యాగ్ ను పెట్టారు. ఇటీవల విష్ణు హాలీవుడ్ లో విల్ స్మిత్ తో ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించారు. దీన్ని బట్టి విష్ణు పేరును విస్ స్మిత్ అని మార్చి మనోజ్ కామెడీ చేశారు.
మంచు బ్రదర్స్ మధ్య గొడవలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మోహన్ బాబు పూర్తిగా విష్ణు వైపు ఉండటంతో ఈ వివాదంలో మనోజ్ దేనికైనా రెడీ అంటున్నారు. చివరికి యూనివర్శిటీ వద్ద కూడా తేల్చుకునేందుకు సిద్దమంటున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఘటనలతో.. రెండు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ తండ్రి డైలాగులతో పరస్పరం కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు.
కొద్ది రోజుల కిందట మంచు మనోజ్ హైదరాబాద్‌లో సివిల్ కోర్టుకు వెళ్లి మంచు మనోజ్ తనపై ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అందుకే మనోజ్.. నేరుగా విష్ణుపై ఎలాంటి కామెంట్లు పెట్టకుండా.. పరోక్షంగా విష్ణును గుర్తుకు తెచ్చేలా సెటైర్లు వేస్తూ టవీట్లు పెడుతున్నారు.
Also Read: వర్సిటీ గేటు వద్ద వివాదం, మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు చేసిన పోలీసులు