Yatra 2 Making Video: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' తీశారు. వైఎస్సార్ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అభిమానులనూ మెప్పించారు. 'యాత్ర' చిత్రానికి కొనసాగింపుగా మహి వి రాఘవ్ తీసిన తాజా సినిమా 'యాత్ర 2'. తండ్రి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటించాడు.
ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఏపీ రాజకీయాల ఇతివృత్తంతో తీసిన ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి పాజిటివ్ టాక్‌తో ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పిస్తుంది ఈ 'యాత్ర 2'. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు చాలా క్లీన్‌గా ఉందని జగన్ పాత్రలో జీవా జీవించేశాడని చెబుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు. మేకింగ్ అఫ్ యాత్ర 2 (Making of yatra 2) అంటూ స్పెషల్ వీడియో వదిలింది మూవీ టీం.
ఈ వీడియోలో జగన్ పాత్రలో జీవాని సెలక్ట్ చేయడం దగ్గర నుంచి షూటింగ్ ముగింపు వరకు యాత్ర 2 ను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇక సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. ఇందులో వైఎస్ జగన్ పాత్రను దించేసేందుకు జీవా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, ఎంతగా కష్టపడ్డాడో ఇందులో వివరించాడు. ఓ సీఎం పాత్రలో నటించడం ఒక చాలెంజ్ అంటూ తమిళ యాక్టర్ అయిన తను అసలైన తెలుగు భాష అదీ కూడా పార్లమెంటరి స్లాగ్‌లో మాట్లాడటం ఛాలేంజింగ్ అనిపించిందన్నాడు. అంతేకాదు యాత్ర 2 గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలను కూడా జీవా ఈ వీడియోలో పంచుకున్నాడు. మరి అవేంటో ఇక్కడ చూసేయండి.
Also Read: హనుమాన్ బ్లాక్‌బస్టర్ హిట్ - భారీగా రెమ్యునరేషన్ పెంచిన తేజ సజ్జా! ఎంతంటే..
'యాత్ర 2' కథ విషయానికి వస్తే..
ఈ సినిమా కథ ప్రజలకు తెలియనిది కాదు. కథగా చూస్తే అందరికీ తెలుసు. అది దృష్టిలో పెట్టుకుని కథనం, సన్నివేశాల్లో మహి వి రాఘవ్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. కథతో కంటే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రయత్నం చేశారు. వైయస్సార్ (మమ్ముట్టి) రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. తన కుమారుడు, ఎంపీగా పోటీ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి (జీవా)ను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పరిచయం చేస్తారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైయస్సార్ మరణించిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు.
ప్రోగ్రెస్ పార్టీ హైకమాండ్, మేడమ్ (సుజానే బెర్నెర్ట్) రోశయ్యను సిఎం చేస్తారు. ఆ తర్వాత తండ్రి మరణవార్త విని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కలవడానికి ఓదార్పు యాత్ర చేపడతారు జగన్. అది ఆపేయమని మేడమ్ నుంచి ఆదేశాలు వస్తాయి. వాటిని ధిక్కరించిన జగన్... తాను మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అని, యాత్ర చేస్తానని చెబుతారు. ప్రోగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్థాపిస్తారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు, 2014 & 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? తెలుగునాడు పార్టీ అధినేత చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) నుంచి జగన్ పార్టీకి ఎటువంటి పోటీ ఎదురైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.