Teja Sajja Remuneration: 'హనుమాన్‌' సినిమాతో  పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిడు యంగ్‌ హీరో తేజ సజ్జా. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా స్వామి రంగ' వంటి సినిమాలు విడుదలైనా వాటన్నిటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లు చేసింది. మూవీ విడుదలై దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది. ఇప్పటికీ హనుమాన్‌ పలు థియేటర్లో ఆడుతూనే ఉంది. ఇక మొత్తం ఈ సినిమా రూ.300పైనే కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి ఎన్నో రికార్డ్స్‌ని బ్రేక్‌ చేసింది. మేకర్స్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది ఈ మూవీ. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ వర్మకి.. హీరోగా తేజా సజ్జాకి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. హనుమాన్ సక్సెస్ తో తేజా టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ప్రస్తుతం ఈ హీరోకి వరుస అవకాశాలు వస్తున్నాయి.


ఒక్క భారీ హిట్‌ పడ్డాక హీరోలు పారితోషికం పెంచడం కామన్‌. ఇప్పుడు ఈ కుర్ర హీరో కూడా అదే నిర్ణయం తీసుకున్నాడట. తన నెక్ట్స్‌ సినిమాలకు రెమ్యునరేషన్‌ భారీగా పెంచినట్టు టాక్‌. నిజానికి హనుమాన్‌కు ముందు తేజ రూ. కోటి తీసుకునేవాడట. అయితే హనుమాన్‌ రూ.300 కోట్ల గ్రాస్‌ చేయడంతో ఈ హీరోకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నాడని టాక్‌. దీనిపై నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది విన్న వారంత ఒక్కసారిగా అంత రెమ్యునరేషన్‌ పెంచడమేంటని అనుకుంటున్నారు. 


Also Read: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన 'పద్మ భూషణ్' నటుడు - ఐసీయూలో చికిత్స


రవితేజ డైరెక్టర్‌తో నెక్ట్స్‌ మూవీ?


మాస్‌మాహారాజ రవితేజ ఈగల్‌ మూవీ డైరెక్టర్‌తో తేజ సజ్జా నెక్ట్స్‌ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్‌ కార్తక్‌ ఘట్టమనేని చెప్పడం విశేషం. ఈగల్‌ మూవీ ప్రమోషన్లో ఈ విషయం బయటపెట్టారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన కార్తీక్‌ ఘట్టమనేని ఈగల్‌ తర్వాత హనుమాన్‌ హీరో తేజ సజ్జాతో సినిమా చేస్తున్నానని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ సంబంధించిన విషయాలను తెలియజేస్తామన్నాడు. దీంతో తేజ తదుపరి మూవీ కార్తీక్‌ ఘట్టమనేనితో అని తేలిపోయింది. ఈ మూవీ తేజ భారీగా డిమాండ్‌ చేశాడా? అని అంతా అభిప్రాయపడుతున్నారు. 


'హనుమాన్' కోసం 75 సినిమాలు వదులుకున్న తేజ


అయితే, హనుమాన్ కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డ తేజ సజ్జా ఆ సమయంలో ఏకంగా 70 నుంచి 75 సినిమాలను వదులుకున్నట్లు గతంలో ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు.  హనుమాన్ కోసం నేను సుమారు 25 లుక్ టెస్టులు ఇచ్చానని, సాధారణంగా ఓ సినిమా కోసం ఏ నటుడైనా రెండు, మూడు టెస్టులు మాత్రమే ఇస్తారన్నాడు. కానీ ఈ మూవీలో స్టంట్స్ అన్నీ తానే స్వయంగా చేశానని చెప్పాడు. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ ఉపయోగించలేదని, స్కూబా డైవింగ్ కూడా నేర్చుకొని మరీ నీటి లోపల సీక్వెన్స్ షూట్ చేశానని పేర్కొన్నాడు.