SSMB 28 Movie Update : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. కొంత భాగం చిత్రీకరించారు. కుటుంబంతో కలిసి మహేష్ బాబు లండన్ వెళ్లడంతో సినిమా షెడ్యూల్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. 


లండన్‌లో సోదరితో నమ్రత!
అబ్బాయి గౌతమ్ ఘట్టమనేని, అమ్మాయి సితార (Sitara Ghattamaneni)... పిల్లలు ఇద్దరికీ స్కూల్ హాలిడేస్ వచ్చినప్పుడు మహేష్, నమ్రత దంపతులు ఇలా ఫారిన్ టూర్స్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు దీపావళి సెలవులు రావడంతో లండన్ వెళ్లారు. అక్కడ మహేష్ ఫ్యామిలీతో పాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కూడా ఉన్నారు. ఈ టూర్ ముగించుకుని మహేష్ ఇండియా వస్తున్నారని తెలిసింది. వచ్చీ రాగానే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. 


మహేష్ వచ్చాక రెండో షెడ్యూల్!
SSMB 28 ఫస్ట్ షెడ్యూల్‌లో మహేష్ బాబు మీద భారీ ఫైట్ సీక్వెన్స్ తీశారు.  లండన్ నుంచి మహేష్ వచ్చిన తర్వాత స్టార్ట్ కాబోయే రెండో షెడ్యూల్‌లో హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde), మహేష్, ఇతర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.


Also Read : కోర్టులో 'కాంతార'కు చుక్కెదురు - పాట తెచ్చిన చిక్కులు





   
ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ సినిమాలో ఐటమ్ సాంగ్!
ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని టాక్. ఇప్పటి వరకు త్రివిక్రమ్ తన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేయలేదు. అఫ్‌కోర్స్‌... ఇప్పుడు ఎవరూ ఐటమ్ సాంగ్స్ అనడం లేదు. స్పెషల్ సాంగ్ లేదంటే ప్రత్యేక గీతం అని అంటున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమాలో త్రివిక్రమ్ ప్రత్యేక గీతం ఒకటి రూపొందించారు. అది కూడా పద్ధతిగా ఉంటుంది. ఈసారి అలా కాకుండా మాస్ సాంగ్ చేయాలని డిసైడ్ అయ్యారట. 






హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందని, అది కూడా ఇప్పటి వరకు వచ్చిన ఐటమ్ సాంగ్స్ కంటే ఓ మెట్టు పైన ఉండేలా ట్రై చేస్తున్నారని టాక్. అందులో మహేష్ బాబుతో ప్రముఖ హీరోయిన్ స్టెప్స్ మ్యాచ్ చేయనున్నారని సమాచారం. 






మాంచి ట్యూన్స్ రెడీ చేసిన తమన్!
మహేష్ బాబుకు సూపర్ డూపర్ ఆల్బమ్స్ ఇచ్చిన క్రెడిట్ సంగీత దర్శకుడు తమన్ ఖాతాలో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఆయన ఏ విధమైన సంగీతం ఇస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తున్నారు. పైగా, మహేష్ - త్రివిక్రమ్ కలయికలో తమన్ చేస్తున్న తొలి చిత్రమిది. అందుకని, స్పెషల్ కేర్ తీసుకుని మరీ ట్యూన్స్ చేశారట. మాంచి ట్యూన్స్ నాలుగైదు రెడీ అయ్యాయని, ప్రస్తుతం ఐటమ్ సాంగ్ వర్క్ జరుగుతుందని టాక్. 


విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.