టాలీవుడ్లో ఇద్దరు సూపర్ స్టార్లను తెలుగు ప్రేక్షకులు ఒకేతెరపై చూడబోతున్నారు. ప్రిన్స్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే. త్వరలో వీరిద్దరూ ఒకే వేదికపై అలరించబోతున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’షోకు ఎన్టీఆర్ హోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోకు ప్రతివారం ఒక గెస్టును పిలుస్తారు. గతంలో సమంత, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు గెస్టుగా వచ్చారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఎపిసోడ్ త్వరలో రాబోతోందంటూ జెమిని ఛానెల్ వాళ్లు కూడా ప్రకటించారు.
వీరిద్దరి ఎపిసోడ్ కు ఓ రేంజ్లో టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ షోలో మహేష్ బాబు పాతిక లక్షలు గెలుచుకున్నట్టు సమాచారం. మహేష్‌కు చదివే అలవాటు ఉండడం వల్లే ఆయన పాతిక లక్షలు గెలచుకున్నారు. తాను గెలుచుకున్న మొత్తాన్ని ఓ స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇచ్చేశారట ప్రిన్స్. అభిమానులు ఈ ఎపిసోడ్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.