టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే మహేష్ బాబుకి మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. అయినా కూడా మహేష్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ మాత్రం మహేష్ బాబు అలాగే తన ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. అయితే మహేష్ మాత్రం కేవలం అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తారు. అలా మహేష్ తన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే అది క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది.


మహేష్ న్యూ లుక్ అదుర్స్


తాజాగా మహేష్ బాబు తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ సెల్ఫీ పిక్ ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ ఫోటోలో బ్లూ టీ షర్ట్ మరియు బ్లాక్ షేడ్స్ పెట్టుకొని ట్రిమ్ చేసిన గడ్డంతో సూపర్ కూల్ లుక్ లో కనిపించారు. అలాగే ఈ సెల్ఫీ పిక్ కింద పాజ్ అండ్ రీసెట్ అనే క్యాప్షన్ని సైతం ట్యాగ్ చేశారు. దీంతో ప్రస్తుతం మహేష్ న్యూ లుక్ ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు  నెటిజెన్స్ ని సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక1 మహేష్ న్యూ లుక్ పై ఫ్యాన్స్, నెటిజన్స్ లైక్స్ తో పాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. 'హాలీవుడ్ యాక్షన్ హీరో లా ఉన్నాడంటూ' కామెంట్ చేయగా.. 'SSMB 28' గ్లిమ్స్ మే 31 కోసం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని మరో నేటిజన్ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ 'ఊబర్ ఫుల్ లుక్ లో మహేష్ బాబు అదిరిపోయారు' అంటూ రాస్కొచ్చాడు. ఇక ఈ సెల్ఫీ పిక్ పై అటు మహేష్ భార్య నమ్రత సైతం కామెంట్ చేస్తూ కొన్ని ఫైర్ ఈమోజీలను ట్యాగ్ చేసింది.






మే 31న 'SSMB28' టైటిల్ అండ్ టీజర్ గ్లిమ్స్


ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'SSMB28' అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే,  శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ సినిమాలో త్రివిక్రమ్ మహేష్ బాబుని మునిపెన్నడు చూడని పాత్రలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమా నుంచి మే 31 మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి 'అమరావతికి అటు ఇటు',  'గుంటూరు కారం' అనే టైటిల్స్ ని పరిశీలనలో ఉంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో 'గుంటూరు కారం' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్,ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : త్వరలో తరుణ్ పెళ్లి? రీఎంట్రీ‌పై ఆసక్తికర విషయాలు చెప్పిన రోజా రమణి