YS Viveka Case :   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మరోసారి ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిల స్టేట్‌మెంట్ ను రికార్డు చేశారు. వివేకానందరెడ్డి రాసినట్లుగా చెబుతున్న లేఖ విషయంలో తాజా స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల  వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్లుగా చెబుతున్నలేఖకు నిన్ హైడ్రేన్ టెస్ట్ నిర్వహించాలని సీబీఐ నిర్ణయించుకుంది.   కాగితం లేదా కార్డ్ బోర్డ్ వంటి వాటిపై ఉపరితలాలపై గుప్త వేలిముద్రలను గుర్తించడానికి నిన్ హైడ్రేట్ టెస్టును నిర్వహిస్తారు.   వేలి ముద్రలు కన్నా ముందే ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలలో ఫోరెన్సిక్‌ సైకలాజికల్‌ విశ్లేషణ చేయిచింది. ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించారని.. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వెల్లడించింది. అందుకే ఆయన చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని విశ్లేషణ తెలిపింది. కోర్టుకు కూడా సమర్పించింది. ఇప్పుడు వేలి ముద్రల లెక్క తీశారు. ఆ రిపోర్టు వచ్చిందేమో కానీ..  సునీత, రాజశేఖర్ రెడ్డిల స్టేట్ మెంట్‌ను మరోసారి రికార్డు చేశారు. 


ఉదయ్ కుమార్ రెడ్డి సన్నిహితుల్ని విచారణకు పిలిచిన సీబీఐ 


వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం విచారణకు హాజరు  కాలేదు కానీ.. ఆయనతో సన్నిహితంగా ఉండే ముగ్గురు కీలక అనుచరులు విచారణకు హాజరయ్యారు.  నాగేళ్ల విశ్వేశ్వర రెడ్డీ, వర్రా రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనేవారు ముగ్గురూ హత్య జరిగిన రోజున ఉదయ్ కుమార్ రెడ్డి వెంట ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారని చెబుతున్నారు. హత్యను గుండెపోటుగా ప్రచారం చేయడంలో వీరు కీలకపాత్ర పోషించినట్లుగా  ప్రచారం జరుగుతోంది.  ఉదయ్ కుమార్ వీరితో పలు దఫాలుగా ఫోన్ సంభాషణలు జరిపినట్లుగా తేలడంతో విచారణకు పిలిచారు. 


సీఎం జగన్ ప్యాలెస్‌లన్నీ బీనామీల పేర్ల మీదే - టీడీపీ సంచలన ఆరోపణలు !


19న విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటీు


వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి 19వ తేదన తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. వాస్తవానికి  మంగళవారం ఆయన సీబీఐ ఎదుట రాజరు కావాల్సి ఉంది. కానీ తనకు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చివరి క్షణంలో అవినాష్ రెడ్డి లేఖ రాశారు. నాలుగు రోజుల పాటు రాలేనని చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. 19వ తేదీన హాజరు కావాలని ఆదేశించారు. 


అవినాష్ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ - మళ్లీ ఎప్పుడు రావాలని చెప్పిందంటే ?


నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాలున్నాయన్న అవినాష్ రెడ్డి                           


వైఎస్ అవినాష్ రెడ్డి హాజరువుతారని ఉదయం వరకూ ప్రచారం జరిగింది.  ఆయన నిన్ననే  పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చారు.  ఉదయం నుంచి సీబీఐ కార్యాలయం వద్ద పులివెందల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు గుమికూడారు.  అయితే   చివరి క్షణంలో అవినాష్ రెడ్డి ఆగిపోయారు. తాను విచారణకు రాలేనని మరో నాలుగు రోజుల సమయం కావాలని ఆడిగారు.  ముందుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉన్నందున రాలేనంటున్నారు.  ఇలా సీబీఐ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ కు హాజరు కాకపోవడం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా ప్రతీ సారి ఇదే సమాధానం ఇచ్చారు. కొన్ని సార్లు కోర్టులకు వెళ్లారు. ఈ కారణంగానే  అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు కూడా చెప్పింది.