స్పై థ్రిల్లర్ ఫిల్మ్స్ అంటే చిత్రసీమకు మాత్రమే కాదు... సగటు సినిమా ప్రేక్షకులలో కూడా ఆసక్తి ఎక్కువే. జేమ్స్ బాండ్ నుంచి ఆ మధ్య తెలుగులో వచ్చిన 'గూఢచారి' సినిమా వరకు... స్పై థిల్లర్ జానర్ సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ. అందుకేనేమో, ఇప్పుడు తెలుగు హీరోలు స్పై థ్రిల్లర్స్ వెనుక పడ్డారు. వెండితెరపై గూఢచారిగా కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 


'స్పై'లో సుభాష్ చంద్రబోస్!
యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా సినిమా 'స్పై'. అందులో ఆయనది గూఢచారి పాత్ర. మే 15న (నిన్న, సోమవారం) టీజర్ విడుదల చేశారు. అందులో కథా నేపథ్యం ఏమిటి? అనేది క్లారిటీగా చెప్పేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose)కి సంబంధించిన ఫైల్ ఒకటి మిస్ అవుతుంది. దానిని వెతికే బాధ్యత హీరో చేతిలో పెడుతుంది ఇండియన్ రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) & ఇంటిలిజెన్స్ టీమ్!


'డెవిల్'లోనూ సుభాష్ చంద్రబోస్!
'స్పై' గురించి కాసేపు పక్కన పెడితే... నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'డెవిల్'. అందులోనూ హీరో గూఢచారి. అంతే కాదు... ఆ సినిమాలోనూ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన ఉంటుంది. ఆయన డెత్ మిస్టరీ మీద కథ సాగుతుందట! రెండిటి కథా నేపథ్యం ఒక్కటేనని వార్తలు వచ్చాయి. హీరో నిఖిల్ ముందు ఆ ప్రశ్న ఉంచగా... 


మేం మాట్లాడుకున్నాం... రెండు కథలు వేర్వేరు! - నిఖిల్
''కళ్యాణ్ రామ్ గారి 'డెవిల్' కథ 1920 నేపథ్యంలో ఉంటుంది. మా సినిమాలో కథ ప్రస్తుత కాలంలో సాగుతుంది. రెండిటినీ కంపేర్ చేయలేరు. ఎందుకు అంటే... మా వాళ్ళు మాట్లాడుకున్నారు. రెండూ వేర్వేరు కథలు'' అని నిఖిల్ వివరించారు. 


హైదరాబాదులో నేతాజీ విగ్రహం లేదు! - నిఖిల్
న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్ (రాజ్‌పథ్)లో 'స్పై' టీజర్ విడుదల చేశారు. తెలుగు సినిమా అంటే ఎక్కువ హైదరాబాద్ సిటీలో ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. న్యూ ఢిల్లీ వెళ్ళడానికి గల కారణాన్ని నిఖిల్ వివరిస్తూ... ''ముందు మేం మన సిటీలో చేయాలని అనుకున్నాం. కానీ, హైదరాబాదులో ఎక్కడా నేతాజీ విగ్రహం లేదు. అందుకని ఢిల్లీ వెళ్లాం'' అని చెప్పారు. ఐకానిక్ కర్తవ్య పథ్ ప్రాంతంలో విడుదల అయిన మొదటి సినిమా టీజర్ 'స్పై' కావడం విశేషం.


'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ సినిమా కావడంతో...
'స్పై' సినిమా మీద నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణం 'కార్తికేయ 2' అని చెప్పాలి. ఉత్తరాదిలో చిన్న సినిమాగా విడుదలై, ఆ తర్వాత భారీ విజయం సాధించింది. అక్కడ నిఖిల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆయనకు అంటూ సపరేట్ మార్కెట్ ఏర్పడింది. 'స్పై'ను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.


Also Read గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?  


'స్పై' సినిమా ద్వారా ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈడీ  ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఆయనే సినిమాకు కథ అందించారు. ఈ చిత్రానికి రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. 


Also Read : తమన్నా హ్యాండ్ బాగ్ రేటు ఎంతో తెలుసా?