సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్న ఈ హీరో తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. దాదాపు 18 ఏళ్ల తరువాత తన భార్య నమ్రతతో కలిసి ఫొటోషూట్ లో పాల్గొన్నాడు మహేష్ బాబు. ఈ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ జంట. 


Also Read: ''ఇండస్ట్రీలో నటుల బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఈగోలే ఎక్కువ..''


2000లో 'వంశీ' సినిమా షూటింగ్ సమయంలో నమ్రతతో పరిచయం ఏర్పడిందని.. అది ఇష్టంగా మారిందని మహేష్ తన ప్రేమ సంగతులు చెప్పుకొచ్చారు. దాదాపు ఐదేళ్లు రిలేషన్ లో ఉన్న తరువాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని చెప్పారు. తన సినిమా విషయాల గురించి చెబుతూ.. స్క్రిప్ట్ లను సొంతంగా సెలెక్ట్ చేసుకుంటానని.. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి అలానే చేస్తున్నట్లు.. తన భార్యతో కూడా చర్చించనని అన్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు హిట్, ఫ్లాప్ లు రుచి చూస్తుంటానని.. ఫెయిల్ అయిన ప్రతిసారి మరింత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటానని చెప్పుకొచ్చారు. 


ఒక సినిమా ఆడకపోతే చాలా బాధగా ఉంటుందని.. కానీ ఈ మధ్యకాలంలో మంచి హిట్స్ వస్తున్నాయని.. కానీ గతంలో కొన్ని అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ప్రయోగాలు చేస్తే వర్కవుట్ అవ్వలేదని 'స్పైడర్' సినిమా గురించి మాట్లాడారు. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నారు. అలానే వచ్చే ఏడాదిలో రాజమౌళి సినిమాను కూడా మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. 










Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి