'మై విలేజ్ షో' అనే యూట్యూబ్ ఛానెల్ తో పాపులారిటీ దక్కించుకున్న గంగవ్వ.. మెల్లగా సినీ స్టార్లను ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకి బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. సీజన్ 4లో పార్టిసిపేట్ చేసిన గంగవ్వ.. చాలా కాలం పాటు హౌస్ లో ఉంది. కానీ ఆమె అలా ఒకటే హౌస్ లో ఉండలేక హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తరువాత సినిమా అవకాశాలు దక్కించుకుంది. రీసెంట్ గా విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమాలో ఓ పాత్రలో కనిపించింది. 


Also Read: ఫిమేల్ బాడీ డ్రెస్ లో సోనమ్ కపూర్.. ఫ్యాషన్ కి ఐకాన్ అంటూ కామెంట్స్...


అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'గాడ్ ఫాదర్'లో కూడా ఛాన్స్ కొట్టేసింది. అయితే 'లవ్ స్టోరీ' సినిమా మాదిరి ఓ చిన్న పాత్ర చేస్తుందని అందరూ భావించారు. ఈ క్రమంలో ఆమె రోల్ కి సంబంధించిన అప్డేట్ బయటకొచ్చింది. 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవికి తల్లిగా కనిపిస్తుందట గంగవ్వ. ఈ విషయాన్ని గంగవ్వ స్వయంగా వెల్లడించింది. 'లవ్ స్టోరీ' మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో భాగంగా సినిమా టీమ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో హీరో నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు గంగవ్వ కూడా పాల్గొంది. ఈ క్రమంలో తాను చిరంజీవి సినిమా షూటింగ్ కోసం ఊటీ వెళ్లానని.. ఇందులో చిరుకి తల్లిగా నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. 


ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే గంగవ్వ ఏకంగా మెగాస్టార్ కి తల్లిగా నటించడం విశేషం. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాను పూర్తి చేసిన చిరు ప్రస్తుతం మోహన్ రాజ్ దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమాల్లో నటించనున్నారు చిరంజీవి.