Madhuri Dixit: ప్రపంచంలో యాపిల్ సంస్థ గ్యాడ్జెట్స్‌కు ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. ముఖ్యంగా ఇండియాలో ఈ సంస్థ ప్రొడక్టులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తమ మార్కెట్‌ను ఇక్కడ విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఏప్రిల్ 18న (మంగళవారం) ముంబైలో యాపిల్ తొలి స్టోర్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారతదేశానికి వచ్చేశారు. ఆయనకు బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముంబై సాంప్రదాయ వంటకాలను ఆయనకు రుచి చూపించారు.


ఈ మేరకు ముంబై లోని ఓ రెస్టారెంట్ కు టిమ్ కుక్‌కు విందు ఏర్పాటు చేశారు. ముంబైలో ఫేమస్ ఫుడ్ వడాపావ్‌ గురించి మాధురి ఆయనకు వివరించారు. వడాపావ్ రుచికి టిమ్ మంత్రముగ్దులయ్యారు. మాధురి, టిమ్ రెస్టారెంట్ లో వడాపావ్ ను తింటున్న ఫోటోను మాధురి దీక్షిత్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ‘‘ముంబైలో వడాపావ్ కు మించిన వెల్కమ్ ఇంకోటి దొరకదు’’ అంటూ ట్యాగ్ లైన్ కూడా రాసుకొచ్చింది. టిమ్ కూడా మాధురి దీక్షిత్ పోస్ట్ ను రీపోస్ట్ చేశారు. ముంబై ఫేమస్ ఫుడ్ వడాపావ్ ను తనకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలని తెలిపారు. వడాపావ్ చాలా రుచికరంగా ఉందన్నారు.


యాపిల్ కంపెనీ భారతదేశంలో గత 25 సంవత్సరాలుగా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో తమ మార్కెట్‌ను ఇండియాలో మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే భారత్ లో రెండు యాపిల్ రిటైల్ స్టోర్స్ ను ప్రారంభిస్తోంది. యాపిల్‌ బీకేజీ పేరుతో మొదటి స్టోర్ ను ముంబై లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టోర్ లను ప్రారంభించిన అనంతరం బుధవారం టిమ్ కుక్ ప్రధాని నరేంద్ర మోదీ, ఐటీ శాఖా మంత్రి లను కలసి పలు కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. భారత్ లో యాపిల్ బిజినెస్ ను మరింత విస్తరించేలా ఈ చర్చలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. స్టోర్‌ లో వినియోగదారులు యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు సేవలను వినియోగించుకోవచ్చు. స్టోర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా లోకల్‌ ఆర్టిస్టులు, ఇన్నొవేటర్స్‌ ను హైలెట్‌ చేస్తూ కంపెనీ ప్రత్యేకంగా ‘టుడే ఎట్ యాపిల్’ వర్క్‌షాప్‌ ను నిర్వహించబోతున్నట్లు సమాచారం.


Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?