Laddu Gaani Pelli Lyric Video: నార్నే నితిన్‌, సంగీత్ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం ఈ సినిమా యూత్ ను క్రేజీగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ అనే మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే సంగీత్ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ చొక్కా, లుంగీలో స్టైలిష్‌గా నడచుకుంటూ వస్తున్న ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ‘లడ్డూగాని పెళ్లి’ అనే లిరికల్ వీడియో విడుదల అయ్యింది. 


యూత్ లో జోష్ నింపుతున్న లిరికల్ వీడియో


‘లడ్డూ గాని పెళ్లి‘ అంటూ సాగే ఈ పాట పిల్లాడితో మొదలుకొని ముసలి వాళ్ల వరకు అందరీలోనూ జోష్ నింపుతోంది. చిత్రబృందం ముందుగా ప్రకటించినట్లుగానే, ఇవాళ(సెప్టెంబర్ 20న) ఫుల్ లిరికల్ ను రిలీజ్ చేశారు. సూపర్ డూపర్ లిరిక్స్, మాస్ స్టెప్పులు వారెవ్వా అనిపిస్తున్నాయి. ఈ పాట సినిమాకే హైలెట్ కాబోతోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్‌ చేసిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తో అదరగొట్టబోతున్నారని చెప్పేందుకు ఈ పాటే ఎగ్జాంఫుల్ గా నిలుస్తోంది. తొలి పాటతోనే ఈ సినిమాపై జోరుగా అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులలో ఓ రేంజిలో క్యూరియాసిటీ పెరిగింది. 'మ్యాడ్' చిత్రంలో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ‘కళ్ళజోడు కాలేజీ పాప‘ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. యువతను ఓ రేంజిలో కట్టుకుంది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' కోసం రూపొందించిన ‘లడ్డు గాని పెళ్లి‘ సాంగ్ మరో లెవల్ లో ఉంది. తీన్మార్ బీట్‌ లతో థియేటర్లలో దుమ్మురేపేలా ఉంది.     


ఇందులోనూ ‘మ్యాడ్‘ హీరోయిన్లేనా?


‘మ్యాడ్‘ సినిమాలో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌ కుమార్‌, గోపికా ఉద్యన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఎవరు నటిస్తారు? అనేదానిపై ఆసక్తి నెలకొన్నది. ఫస్ట్ పార్ట్ లో నటించిన వాళ్లనే సీక్వెల్ లోనూ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌ టైన్‌ మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీక్వెల్ ను మరింత ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందించేందుకు దర్శకుడు కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌ అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షామ్‌ దత్ కెమెరామెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. 


Read Also: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 



Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే