మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేసన్ (MAA) ఎన్నికలు ఉత్కంఠగా జరిగాయి. ఫలితాలు సైతం అంతకు మించిన ఉత్కంఠ రేపాయి. ఎట్టకేలకు మంచు వారబ్బాయి అనుకున్నది సాధించారు. మా నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. నేడు జరిగిన మా ఎలక్షన్స్‌లో ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. మా ఫలితాలు కొందరికి తీపి ఫలితాలు ఇవ్వగా.. మరికొందరికి చేదు నిజంగా మారనున్నాయి.


మా ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పదవులు కేవలం తాత్కాలికం మాత్రమేనని, అందరం సినీ కళామతల్లి బిడ్డలమని గుర్తుంచుకోవాలని అన్నారు. మా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అందరం కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. పదవుల కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన మరొకర్ని దూషించడం, నిందించడం, దుష్ప్రచారం చేసుకోవడం సరైన పని కాదన్నారు. తాత్కాలిక పదవుల కోసం మనల్ని మనమే తిట్టుకోవడం అవసరమా అని చిరంజీవి ప్రశ్నించారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు అవసరం లేదని, వాటిని పక్కన పెట్టి ముందుకు సాగాలని మా నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు.


Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విన్నింగ్ పాయింట్స్ ఇవే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే.. 






ప్రజల్లో చులకన అవుతాం..
పదవుల కోసం సినీ నటులమైన తాము ఒకర్నొకరు తిట్టుకోవడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో చులకన అయిపోతామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కావొద్దని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. వివాదాలు పుట్టించిన వ్యక్తులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరస్పరం తిట్టుకుంటూ పరువు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. తమది వసుదైక కుటుంబమని, కలిసికట్టుగా సినీ పరిశ్రమను డెవలప్ చేసుకోవాలన్నారు. 


Also Read: హేమా కొరుకుడు.. హాస్పిటల్‌లో శివ బాలాజీ.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్


మా అధ్యక్షుడిగా మంచు విష్ణు
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్‌పై విష్ణు గెలుపొందగా. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల రవి, హేమ గెలుపొందగా.. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ విజయం సాధించారు. విష్ణు ప్యానల్‌కు చెందిన అభ్యర్థి బాబు మోహన్‌పై శ్రీకాంత్ గెలుపొందారు.


Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


మా ఎలక్షన్ కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. మంచు విష్ణు ప్యానల్ సభ్యులు మరొకరు విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందిన జీవితా రాజశేఖర్‌పై 7 ఓట్ల తేడాతో విష్ణు ప్యానల్ సభ్యుడు రఘుబాబు గెలుపొందారు. ట్రెజరర్‌గా శివ బాలాజీ విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానల్‌ నుంచి పోటీ చేసిన శివ బాలాజీ.. ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థి నాగినీడుపై గెలుపొందారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి