ఎన్నడూలేని విధంగా 'మా' ఎలెక్షన్స్ లో రోజుకో వివాదం చెలరేగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ఒకరినొకరు దూషించుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ వివాదాలకు టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా దూరంగా ఉన్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారు తమ పని తాము చేసుకుంటున్నారు. వీళ్లు ఎప్పుడూ కూడా 'మా' ఎలెక్షన్స్ లో కలుగజేసుకోలేదు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.
Also Read: ‘మా’ ఎన్నికలు.. దీనికి కూడా బయట వాళ్లు ఎందుకు? దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్టీఆర్ పేరు ఇలా తెరపైకి రావడంతో ఆయన గురించి కథనాలు ప్రచురిస్తూ మీడియాలో హడావిడి మొదలైపోయింది. మంచు విష్ణు ప్యానెల్ కి మద్దతిస్తున్న నరేష్ పై ఆరోపణలు చేసే సమయంలో ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించారు జీవితా రాజశేఖర్. ఎన్నికలతో అసలు సంబంధం లేని ఎన్టీఆర్ పేరుని మధ్యలోకి తీసుకొచ్చారు. ఈ మధ్య ఎక్కడో ఓ పార్టీలో ఎన్టీఆర్ కి కలిస్తే జీవితరాజశేఖర్ 'మా' ఎలెక్షన్స్ లో ఓటు వేయమని అడిగారట. దానికి ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది.
ఓటు వేయమని తనను అడగొద్దని.. ప్రస్తుతం అసోసియేషన్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే చాలా బాధగా ఉందని తారక్.. జీవితతో అన్నారట. దీంతో ఇప్పుడు అందరూ తారక్ పై పడ్డారు. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఓటు వేయమని చెప్పడం ఏంటంటూ కథనాలు, చర్చలు మొదలయ్యాయి.
తాజాగా ప్రకాష్ రాజ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఎన్టీఆర్ అలా ఓటు వేయనని చెప్పడం కరెక్ట్ కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. ఎన్టీఆర్ కి ఫోన్ చేసి అడుగుతానని.. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు బంగారం అని చెబుతానని.. వచ్చి ఓటు వేయమని కోరతానని అన్నారు. నచ్చిన వాళ్లకు ఓటు వేయమని అడుగుతానని అన్నారు. జీవిత ఏదో పొరపాటున ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించారని.. ఆమె కావాలని అలా చేయరని అన్నారు ప్రకాష్ రాజ్.
Also Read : సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార వెండితెర ఎంట్రీ...ఏ సినిమాతో అంటే...
Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత
Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి