మిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్వకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘లవ్ టుడే’. తమిళనాట చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన వారం రోజుల్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, రవీనా రవి, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక కొత్త వార్త వచ్చింది. సినిమా విడుదల అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూవీ టీమ్. అయితే ఈ సినిమా తమిళ వెర్షన్.. తెలుగు కంటే ముందుగానే ఓటీటీలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.


‘లవ్ టుడే’ తమిళ వెర్షన్‌ డిసెంబర్ రెండు నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుందట. అయితే తెలుగులో ఈ సినిమా నవంబర్ 25న థియేటర్లలో విడుదల అయింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవడంతో ఇప్పట్లో తెలుగు ఓటీటీ వెర్షన్ వచ్చే అవకాశాలు లేవు. క్రిస్మస్ తర్వాతే ఈ సినిమా తెలుగు వెర్షన్ డిజిటల్ వేదికగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


ఇక సినిమా విషయానికొస్తే.. తమిళంలో జయం రవి హీరోగా వచ్చిన ‘కోమలి’ సినిమాకు దర్వకత్వం వహించిన ప్రదీప్ రంనాథన్ ఈ లవ్ టుడే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏమిటంటే.. సినిమా దర్శకుడు, హీరో ఒక్కరే కావడం. ప్రదీప్ రంగనాథన్ తాను అనుకున్నపాయింట్ ను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఓ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా సినిమాను రూపొందించారు ప్రదీప్. ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ లు మనిషి జీవితం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా దీనివల్ల యువత ఎలా పెడదోవ పడుతున్నారో చూపించారు.



ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికులు సెల్ ఫోన్ లు మార్చుకుంటే ఎలా ఉంటుంది? వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదర్కోవాల్సి వస్తుంది లాంటి అంశాలను చక్కగా చూపించారు. ఓ వైపు ఎంటర్టైన్మెంట్ గా నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ సీన్స్ తో ఆలోచింపజేసేలా కథను తీర్చిదిద్దాడు ప్రదీప్ రంగనాథన్. సెల్ ఫోన్లు మార్చుకోవడం అనే చిన్న పాయింట్ పై సినిమా మొత్తాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా తీయడంలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. సినిమాలో ఉండే ప్రతీ పాత్రనూ ఇన్వాల్స్ చేసేలా అతడు తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఉత్తమన్ ప్రదీప్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. నిఖిత శాస్త్రి పాత్రలో ఇవానా నటన ఆకట్టుకుంటుంది. సెల్ ఫోన్ అనేది యూనివర్సల్ అంశం కావడంతో ఈ సినిమా విడుదల అయిన ప్రతీ చోటా హిట్ టాక్ ను సంపాదించుకుంటోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. మరి ఈ మూవీ తెలుగులో ఎంతమేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Read Also: బ్రూస్ లీ వన్ ఇంచ్ పంచ్ కు ప్రపంచం ఫిదా, ఈ పంచ్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యింది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే?