Teacher Uses Drill Machine on Student:
డ్రిల్లింగ్ మెషీన్‌తో..
యూపీలోని కాన్‌పూర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో దారుణం జరిగింది. ఐదో తరగతి పిల్లాడు రెండో ఎక్కం మర్చిపోయాడన్న కోపంతో ఓ టీచర్ విద్యార్థి చేతిని డ్రిల్లింగ్ చేశాడు. రెండో ఎక్కం చెప్పాలని అడిగినా...చెప్పలేదని..ఇలా డ్రిల్లింగ్ మెషీన్‌తో చేతిని డ్రిల్ చేశాడు. సిసమౌకు చెందిన విద్యార్థిని...ప్రేమ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అప్పర్ ప్రైమరీ చదువుతోంది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. "రెండో ఎక్కం చెప్పాలని టీచర్ నన్ను అడిగారు. నేను చెప్పలేకపోయాను. వెంటనే ఆయన నా చేతిని డ్రిల్ చేశాడు. నా పక్కనే ఉన్న ఫ్రెండ్ డ్రిల్లింగ్ మెషీన్ ప్లగ్‌ను వెంటనే తీసేసింది" అని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. విద్యార్థిని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున స్కూల్‌కి వచ్చారు. దీంతో చాలా సేపటి వరకూ ఉద్రిక్తత నెలకొంది. వీళ్లంతా వచ్చి నిలదీసేంత వరకూ స్థానిక విద్యా అధికారులకు ఈ సంఘటన గురించి తెలియనే లేదు. ఈ ఘర్షణ జరిగాకే...స్థానిక విద్యాధికారులు స్పందించారు. ఈ సంఘటన గురించి
తెలుసుకున్న అధికారులు...విచారణకు ఆదేశించారు. "ఈ ఘటనను విచారించేందుకు ప్రత్యేక కమిటీ నియమించాం. ప్రేమ్‌నగర్, శాస్త్రి నగర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌లు విచారణ జరిపించి రిపోర్ట్ తయారు చేస్తారు. ఇందుకు బాధ్యులైన వారిపై తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం" అని వెల్లడించారు. బాధితురాలికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇటీవల నెల్లూరులో..
నెల్లూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో హోం వర్క్ బుక్ తేలేదని నెల్లూరులో ఓ టీచర్ విద్యార్థిని కర్రతో కొట్టింది. పొరపాటున అది కంటిదగ్గర తగలడంతో విద్యార్థికి గాయమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లవాడిని టీచర్ గాయపరిచిందని కేసు పెట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్ పై కేసు నమోదు చేశారు. స్కూల్ లో పిల్లలను మందలించడంలో తప్పులేదు. కానీ కొన్నిసార్లు పొరపాటునో, గ్రహపాటునో మందలింపు శృతి మించుతుంది. లేదా విద్యార్థికి బలమైన గాయమవుతుంది. అలాంటి సందర్భాల్లో టీచర్లు అనుకోకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. విద్యార్థి మేలు కోసమే టీచర్ ఇక్కడ అతడిని మందలించింది. అయితే పొరపాటున కంటి వద్ద గాయం కావడంతో విషయం పెద్దదైంది. అయితే తల్లిదండ్రులు ఈ విషయంలో రాజీ పడలేదు. నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. దీంతో పోలీసులు టీచర్ పై కేసు పెట్టారు. అయితే ఆ విద్యార్థిని తాను కావాలని గాయపరచలేదని, తన తప్పేం లేదని చెప్పారు టీచర్. హోం వర్క్ బుక్ తీసుకు రాలేదని తాను కర్రతో కొట్టానని, పొరపాటున కంటిపై తగిలిందని వివరించారు. తన తప్పు లేకపోయినా తనపై కేసు పెట్టారని అన్నారు.
Also Read: Viral News: మస్క్ మామ ట్వీట్‌కి యూపీ పోలీస్‌ల అదిరిపోయే రిప్లై, వైరల్ అవుతున్న పోస్ట్