రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు హరిప్రసాద్ పేరును భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించడం పై సిరిసిల్ల పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఆదివారం తన 95 వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతిలో సిరిసిల్ల పేరు ప్రఖ్యాతలు, సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ ప్రతిభను ప్రధాని మోదీ ప్రశంసించారు. చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపించిన నరేంద్ర మోడీ సిరిసిల్ల నేత కళాకారులు హరిప్రసాద్ ప్రతిభను తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ... తెలంగాణ పేరును గుర్తు చేశారు.
వెల్ది హరిప్రసాద్ తనకు పంపించిన అద్భుత బహుమతిని చూసి ఆశ్చర్యపోయానని ప్రధాని అన్నారు. చేనేత కళాకారుడు హరిప్రసాద్ తాను స్వయంగా నేసిన జీ20 లోగోను పంపించారని, అది అందరినీ ఆకర్షిస్తుందంటే మన్ కీ బాత్ లో మోదీ వ్యాఖ్యానించారు. చేనేత కార్మికుల గొప్పతనాన్ని కళా నైపుణ్యాన్ని వివరిస్తూ అభినందించిన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆసక్తిగా తిలకించారు. జాతీయ స్థాయిలో సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ పేరు సంపాదించడం కాకుండా సిరిసిల్ల పేరును ప్రధాని మోదీచే పలికించడంతో సిరిసిల్ల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న ప్రస్తావన రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ శ్రేణులు హార్షం వ్యక్తం చేశాయి. ‘‘మన్ కీ బాత్ ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ అభినందించారు. దీంతో కళాకారుడు హరిప్రసాద్ తో పాటు జిల్లా బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు. సిరిసిల్ల చేనేత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన కళాకారుడు హరి ప్రసాద్ ని జిల్లా బిజెపి నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
కీలకాంశాలు ప్రస్తావించిన ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి 95వ సారి ప్రసంగించారు. జీ20 శిఖరాగ్ర సదస్సు, అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో శాస్త్రవేత్తలు సాధిస్తోన్న ప్రగతిని, భారత్ - భూటాన్ సంబంధాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్‌తో భారత్‌లో జీ 20 సదస్సు జరుగుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన విక్రమ్- ఎస్ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేయడం ద్వారా భారత్- అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయి చేరుకుందన్నారు ప్రధాని మోదీ.