Aliens Signals To Earth: భూమండలం లాంటి మరో గ్రహం అంతరిక్షంలో ఎక్కడో ఓ కచ్చితంగా ఉంటుదన్న అనుమానంతో పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. గత కొన్ని దశాబ్దాల నుంచి ఎంతో మంది ప్రముఖ శాస్త్రవేత్తల మెదడును ఈ విషయం తొలుస్తుంటుంది. ఇప్పటికే స్పేస్‌లోకి రెడియో సిగ్నల్స్ పంపిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే స్పేస్‌లో ఉన్న రాడార్‌ సిగ్నల్స్‌ ఒకటి, రెండు సార్లు కొన్ని వింత సిగ్నల్స్‌  వచ్చినప్పటికీ.. అవి ఏ గ్రహం నుంచి వచ్చాయన్న విషయాన్ని అయితే కనిపెట్టలేకపోయారు సైంటిస్టులు. 
పాల‌పుంత నుంచి వ‌స్తున్న రేడియో సంకేతాలు !
తాజాగా మరో సీక్రెట్ ఖ‌గోళ శాస్త్రవేత్తల‌ మెదళ్లను తొలిచేస్తుంది. సుదూరంలో ఉన్న పాల‌పుంత నుంచి వ‌స్తున్న రేడియో సంకేతాలు శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యప‌రుస్తున్నాయి. సుమారు నాలుగు వేల కాంతి సంవ‌త్సరాల దూరంలో ఉన్న మిల్కీవే నుంచి, ప్రతి 18 నిమిషాల‌కు ఒక‌సారి రేడియో త‌రంగాలు వస్తున్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ గెలాక్సీలో ఉన్న ఓ న‌క్షత్రం నుంచి త‌రంగాలు వ‌స్తున్నట్లు గ్రహించారు సైంటిస్టులు. అయితే, దాన్ని ఇప్పటి వ‌ర‌కు గ‌మ‌నించ‌లేద‌ని చెబుతున్నారు ఖ‌గోళ శాస్త్రవేత్తలు. కానీ ముర్చిస‌న్ వైడ్‌ఫీల్డ్ ఆరే టెలిస్కోప్ ద్వారా ఆ న‌క్షత్ర స‌మూహాన్ని గుర్తించారు సైంటిస్టులు. 
2018లో తొలిసారి ఆ వస్తువు గుర్తించిన సైంటిస్టులు
కుర్టిన్ యూనివ‌ర్సిటీకి చెందిన ఆస్ట్రోఫిజిస్ట్ న‌టాషా హ‌ర్లే వాక‌ర్, ఆ ర‌హ‌స్య వ‌స్తువుకు చెందిన అంశాల‌ను తాజాగా వెల్లడించారు. న‌క్షత్రం ఆకారంలో ఉండి, తిరుగుతున్న ఆ అంత‌రిక్ష వ‌స్తువును మార్చి 2018లో తొలిసారి గుర్తించారని చెప్పారు నటాషా. ఆ న‌క్షత్రం విడుదల చేస్తున్న రేడియో సంకేతాల‌ను భూమి నుంచి కూడా చూడ‌వ‌చ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదో రోద‌సీ లైట్‌హౌజ్ అని వివరిస్తున్నారు. ఆ న‌క్షత్రం నిర్జీవం కావ‌డమో లేక ద‌ట్టమైన న్యూట్రాన్ స్టార్ లేదా మ‌ర‌ణించిన పొట్టి న‌క్షత్రమైనా అయి ఉంటుంద‌ని అంటున్నారు శాస్త్రవేత్తలు. దానికి అయ‌స్కాంత శ‌క్తి ఎక్కువ‌గా ఉన్నట్లు అంచ‌నా వేస్తున్నారు. 
ముర్చిస‌న్ వైడ్‌ఫీల్డ్ ఆరే టెలిస్కోప్‌తో అంత‌రిక్షాన్ని ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో, ఆ న‌క్షత్రాన్ని  గుర్తించాడు ఓ డాక్టరేట్ విద్యార్థి. అటు దీనిపై క్షుణ్నంగా పరిశోధనలు చేస్తున్నట్టు చెబుతున్నారు. త్వరలో ఈ రహస్యాన్ని ఛేదిస్తామని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ వార్తపై భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్‌. ఈ సిగ్నల్స్‌ కచ్చితంగా ఏలియన్సే పంపారని, మరికొద్ది రోజులు అవి మనపై దాడికి ప్లాన్‌ చేసేందుకే ఇలా సిగ్నల్స్‌ పంపుతున్నాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


డిసెంబర్ లో భూమి మీదకు ఏలియన్స్ 
టైమ్‌ ట్రావెలింగ్‌.. నిజ జీవితంలో ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం తాము టైమ్‌ ట్రావెలింగ్‌ చేసి వచ్చామంటూ చెప్పుకున్నారే తప్ప.. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు అయితే చూపించలేదు. అయితే ఇప్పుడు అలాంటి ఓ వ్యక్తి సంబంధించిన వార్తే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎనో అలారిక్‌ (Eno Alaric)అనే వ్యక్తి.. తాను ఓ టైమ్‌ ట్రావెలర్‌ అని 2671వ సంవత్సరం నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, 2022 డిసెంబర్‌ 08వ తేదీన తాను ఏలియన్స్‌ను కలుసుకోబోతున్నట్లు తెలిపాడు. అయితే ఇది ఎంత వరకు నిజం.. ఇంతకీ అతడు ఎవరన్న విషయం ఎవరికీ తెలియదు.

ఎనో అలారిక్‌ ఓ టిక్‌టాక్‌ అకౌంట్‌ ఉంది. దాని పేరు రేడియంట్‌ టైమ్‌ ట్రావెలర్‌ (Radiant Time Traveler). అయితే కొద్ది రోజుల క్రితం ఇతడు తన టిక్‌ టాక్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ.. దానికి క్యాప్షన్‌గా "attention" అని పెట్టి.. "Yes, Iam A Real Time Traveler From The Year 2671, Remember These Date December 08" అని చెప్పుకొచ్చాడు. ఓ భారీ UFOలో ఏలియన్స్‌ వస్తున్నారని, ఓ ముఖ్యమైన విషయం నాతో మాట్లాడటానికి వస్తున్నారని తెలిపాడు అలారిక్‌.