సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ ఇంకా ఓటీటీలే డామినేట్ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి శుక్రవారం థియేటర్లో విడుదలయ్యే సినిమా కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. సీటిమార్, రాజరాజ చోర లాంటి హిట్స్ థియేటర్స్ లో పడ్డాయి. అదే టైం లో ఓటీటీల హవా కూడా సాగుతోంది. అయితే ఇప్పుడు అందరి చూపు ఈ శుక్రవారం విడుదల కాబోతున్న లవ్ స్టోరీపైనే. ఎందుకంటే నాగ చైతన్య - సాయి పల్లవి పెయిర్ పై ఇంట్రెస్ట్, శేఖర్ కమ్ముల దర్శకత్వం, ఈ సినిమాకి టీం చేస్తున్న ప్రమోషన్స్ ఒక ఎత్తైతే.. సెకండ్ వేవ్ తర్వాత పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకులతో 100 పర్సెంట్ అక్యుపెన్సీతో కళకళలాడింది లేదు. అందుకే ఇప్పుడు లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రెటీలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ లిస్టులో చేరాడు మహేశ్ బాబు.
అమీర్ ఖాన్, చిరంజీవి లాంటి వాళ్ళు లవ్ స్టోరీ ని థియేటర్ లో చూడాలని చెప్పారు. తాజాగా మహేష్ బాబు ట్వీట్ చేస్తూ‘‘తెలుగులో డ్యాన్స్ ఆధారంగా తెరకెక్కే సినిమాలు చాలా అరుదు.. ఇది అలాంటి సినిమా. ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. లవ్ స్టోరీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అంటూ పోస్ట్ చేశాడు.
Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?
ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా ప్రభావంతో రెండుసార్లు వాయిదాపడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు దాటుకుని.. సెప్టెంబర్ 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ లో జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఇక సినిమా నుంచి ఇప్పటివరకూ విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు అన్నీ వావ్ అనిపించాయి. పవన్ సీహెచ్ అందించిన సంగీతం హైలెట్ అయింది. ‘సారంగ దరియా’, ‘నీ చిత్రం చూసి’ వంటి పాటలు సంగీతప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు మహేశ్ బాబునుంచి ప్రసంసలు లభించడంతో జోష్ మీదుంది లవ్ స్టోరీ టీమ్.
Also Read: అజీత్‌తో కార్తికేయ సై.. బర్త్‌డే సందర్భంగా ‘వలిమై’ విలన్ లుక్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న’లవ్ స్టోరీ’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూద్దాం…
Alos Read: కాలేజీలో గ్యాంగ్ వార్, ఈ పిల్ల నాదంటూ గొడవలు..’గల్లీబాయ్స్’ టీజర్ దుమ్ములేపిందన్న అనిల్ రావిపూడి
Also Read: నాలుగు దశాబ్దాలు చిత్రపరిశ్రమకు సేవలందించిన సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఇకలేరు