ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా 'లవ్ స్టోరీ'. ఏషియన్ సినిమాస్ తొలిసారి ప్రొడక్షన్ లోకి దిగి నిర్మించిన ఈ సినిమాకి మొదటినుంచి ఏదొక అంతరాయం ఎదురవుతూనే ఉంది. ముందుగా కొత్తవాళ్లతో సినిమాను మొదలుపెట్టారు. కొంతవరకు షూటింగ్ కూడా నిర్వహించారు. కానీ శేఖర్ కమ్ములు సంతృప్తిగా అనిపించలేదు. దీంతో మొత్తం ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. అప్పటికే సినిమాపై ఐదు కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైంది.
Also Read: 'లైగర్' సెట్స్ లో బాలయ్య.. 'జై' కొట్టిన విజయ్ దేవరకొండ..
ఆ తరువాత ప్రాజెక్ట్ లోకి నాగచైతన్య, సాయిపల్లవి వచ్చారు. దీంతో క్రేజ్ పెరిగింది. షూటింగ్ మొదలుపెట్టగానే.. కరోనా వచ్చింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి మొత్తంగా రూ.35 కోట్లలో సినిమాను పూర్తి చేశారు. సినిమాను చాలా ముందుగా మంచి రేట్లకే విక్రయించారు. నాన్ థియేటర్ మీద కూడా బాగానే గిట్టుబాటు అయింది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్ రేట్లు అక్కడక్కడా సవరించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల నేరుగా విడుదల చేసుకుంటున్నారు.
Also Read: కొణిదెల శివశంకర వర ప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారు? అరుదైన ఫొటోలతో ‘చిరు’ చిత్రమాలిక
సొంత నిధులతో సినిమా నిర్మించినా.. వడ్డీలు లెక్క అనేది ఉంటుంది. ఎందుకంటే ఏషియన్ సంస్థ బేసిక్ గా ఫైనాన్స్ వ్యాపారం నుంచి మొదలైంది. అలా చూసుకుంటే రూ.20 కోట్లు కూడా కాదు.. వడ్డీలు లెక్కలు వేయకుండా రూ.15 కోట్లు థియేటర్ టార్గెట్ అని తెలుస్తోంది. నైజాం మీద మొదటి వీకెండ్ లో రూ.10 కోట్లు రావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ మేరకు థియేటర్ల ప్లానింగ్ చేస్తున్నారు. ఆంధ్రాలో రూ.15 కోట్లు వసూళ్లు తెచ్చుకోగలిగితే నైజాం లాభాలు అందిస్తుందని లెక్కలు వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
Also Read: కాజల్ మెస్మరైజింగ్ లుక్.. ఫోటోషూట్ తో రూమర్లకు చెక్ పెట్టిన బ్యూటీ..
Also Read: పూజాహెగ్డే ప్రవర్తన ప్రభాస్ ని ఇబ్బంది పెట్టిందా..? క్లారిటీ ఇచ్చిన 'రాధేశ్యామ్' మేకర్స్..
Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
Also read: సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ అదుర్స్... విడుదల ఎప్పుడంటే... చిరు ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి