'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తరువాత 'అర్జున్ రెడ్డి' సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. 'గీతగోవిందం' సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. దీంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. తొలిసారి విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అది కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కావడం విశేషం.
Also Read: కాజల్ మెస్మరైజింగ్ లుక్.. ఫోటోషూట్ తో రూమర్లకు చెక్ పెట్టిన బ్యూటీ..
'లైగర్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవల తిరిగి షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే సడెన్ గా ఈ సినిమా సెట్స్ లో నందమూరి బాలకృష్ణ ప్రత్యక్షమయ్యారు. 'లైగర్' సెట్స్ కి వెళ్లిన ఆయన చిత్రయూనిట్ ను అభినందించారు. సినిమా హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
బాలయ్యకు పూరి జగన్నాథ్ తో మంచి రిలేషన్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి 'పైసా వసూల్' అనే సినిమా కోసం పని చేశారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి. ఫ్యూచర్ లో కచ్చితంగా వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని టాక్. అందుకే బాలయ్య కూడా పూరి జగన్నాథ్ కి కాంటాక్ట్ లోనే ఉంటారు. ఇప్పుడు పూరిని కలవడానికి స్వయంగా ఆయన సినిమా సెట్స్ కి వెళ్లారు. బాలయ్య రాకతో సర్ప్రైజ్ అయిన విజయ్ దేవరకొండ 'జై బాలయ్య' అంటూ ట్విట్టర్ లో క్యాప్షన్ పెట్టారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో దాదాపు అందరూ పేరున్న నటీనటులనే ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.